WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ' మోసం చేశారు:చంద్రబాబు...!

ఇక మొహమాటాలు ఏమీ లేవు...ఫేస్‌టూ ఫేస్‌...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీతో అమీతుమీకి దిగారు. అందరూ అనుకుంటున్నట్లు...మార్చి5 నుంచి ఆయన యుద్ధం ప్రారంభిస్తారని భావిస్తే..అంతకన్నా ముందే ఆయన తన ఆయుధాలను ఢిల్లీ పెద్దలపై గురిపెట్టారు. 'మోడీ'తో తేల్చుకోవాలని గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా తలపోస్తున్నా..కొంత మంది సీనియర్‌ మంత్రుల మాట విని..ఆగినా..ఈ రోజు మాత్రం ఆగలేకపోయారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఆయన కేంద్రం చేసిన మోసంపై బహిరంగగా స్పందించారు. ప్రత్యేకహోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని మోసం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా..కొంతైనా అభివృద్ధి జరిగేది..కానీ..ఏమీ ఇవ్వకుండా..నాలుగేళ్లు తిప్పించుకున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదా ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వమని..ఉన్న రాష్ట్రాలకు పొడిగించమని చెప్పిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు..కొన్ని రాష్ట్రాలకు హోదా ఎలా పొడిగించారని ప్రశ్నించారు. ఆంధ్రా విషయంలో మొండి చేయి చూపించి మోసం చేశారని..ఆయన ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా..అభివృద్ధి ఆగదని...రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ కేంద్రంతో మిలాఖత్‌ కావడం వల్లే..రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయడం లేదని ఆయన అన్నారు.  


(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ