WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎంఓ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందట...!

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అధికారులపై తన దాడిని పెంచారు. గురువారం నాడు ఆయన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు 'సతీష్‌చంద్ర, రాజమౌళి,సాయిప్రసాద్‌లపై మరోసారి ధ్వజమెత్తారు. సిఎంఓలో పనిచేస్తోన్న ఐఎఎస్‌ అధికారులు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, టిడిపి నాయకులతో కలసి వారు ఇదే పనిలో ఉన్నారని మరోసారి ఆరోపించారు. ఇంతకు ముందు ఆయన సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి 'సతీష్‌చంద్ర'పై మాత్రమే ఆరోపణలు చేయగా..తాజాగా...మరో ఇద్దరు సిఎంఒ అధికారులు 'రాజమౌళి, సాయిప్రసాద్‌'లపై కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే...'విజయసాయిరెడ్డి' ఆరోపణలపై అధికారుల సంఘం ఖండించినా...'ఆయన' మాత్రం విమర్శలను తగ్గించలేదు. సరికదా..మరింత పెంచారు. తాము అధికారంలోకి రావడంతోనే..ఈ ముగ్గురు అధికారులతో పాటు..ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. వీరు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా...పాలనా వ్యవహారాలు చూడకుండా..ఎమ్మెల్యేల కొనుగోలులో బిజీగా ఉన్నారని ఆరోపించారు. 

  కాగా...'విజయసాయిరెడ్డి' ఆరోపణలపై అధికార టిడిపిలో ఇప్పుడిప్పుడే చలనం వచ్చింది. ఆయన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిపై పది రోజుల క్రితం ఆరోపణలు చేస్తే స్పందించని...టిడిపి..నాయకులు.. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'లో వారి వ్యవహారంపై కథనాలు రావడంతో ఇప్పుడు తీరిగ్గా స్పందిస్తున్నారు. 'విజయసాయిరెడ్డి' 'సతీష్‌'పై ఆరోపణలు చేసిన వెంటనే టిడిపి నేతలు ఎదురుదాడి చేసినట్లయితే...ఆయన ఇప్పుడు తాజాగా ఆరోపణలు చేసేవారు కాదని..సచివాలయ అధికార వర్గాలు అంటున్నాయి. ముందుగా..ఐపిఎస్‌ అధికారుల సంఘం స్పందించినా...ఐఎఎస్‌ల సంఘం మాత్రం స్పందించలేదు. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాలు ప్రచురించిన తరువాత...ఐఎఎస్‌ల సంఘం స్పందించింది. అయితే..టిడిపి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ స్పందించకపోవడంతో 'విజయసాయిరెడ్డి' మరోసారి ఐఎఎస్‌ అధికారులపై ఆరోపణల దాడికి తెగబడ్డారని వారు అంటున్నారు. నిక్కచ్చిగా పనిచేస్తున్న అధికారులపై ఆరోపణలు చేసి వారి దృష్టిని మళ్లించి..అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా...'విజయసాయిరెడ్డి' ఆరోపణలు చేస్తుంటే...మంత్రులు నిస్తేజంగా ఉండిపోయారనే విమర్శలు వస్తున్నాయి. 

  తాజాగా మంత్రులు అచ్చెంనాయుడు, సోమిరెడ్డిలు స్పందించడంతో..'విజయసాయిరెడ్డి' తన వద్ద ఆధారాలున్నాయని బొంకుతున్నారు. ఆధారాలు ఉంటే...నేరుగా కోర్టుకు వెళ్లకుండా..ఎందుకు మీడియాలో గొడవ చేస్తున్నారనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. తాజాగా... 'జగన్‌,విజయసాయిరెడ్డి'ల అవినీతి వ్యవహారంపై మారిషస్‌ కంపెనీలు వేసిన కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే...సిఎంఒపై నిరాధారమైన ఆరోపణలు చేశారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా...ఇటువంటి ఆరోపణలు చేస్తోన్న వైకాపా నాయకుల విషయంలో చూసీ చూడనట్లు పోతే..ప్రభుత్వం పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేలుకొని..ఈ వ్యవహారానికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(566)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ