WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైఎస్‌ 'సతీష్‌' ప్రోత్సహిస్తే...'జగన్‌' విమర్శలు చేయిస్తున్నాడు...!

ఆయన ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి. ఆయన నిజాయితీపరుడు అవుతో..కాదో కానీ..అవినీతిపరుడని..అటు రాజకీయ వర్గాలు కానీ, అధికారవర్గాలు కానీ..ఆరోపణలు చేయలేదు. అందరితో కలుపుగోలుగా మాట్లాడతారు. ఆయనకు చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. ఆయన ఫోన్‌లకు స్పందించరని, ఇష్టమైన వారితోనే మాట్లాడతరానే పేరు ఉంది. కాంగ్రెస్‌ హయాంలోనే నిజాయితీకి, సమర్థతకు సంతృప్తి చెందిన ముఖ్యమంత్రి వై.ఎస్‌ సమర్థంగా ఆయన సేవలను అందించారు. అంతకు ముందు పాలకుల కార్యాలయాల్లో ఆయన బాధ్యత నిర్వహించినా..వై.ఎస్‌ ఆయనను నియమించుకోవడం సంచలనం సృష్టించింది. కాగా ఆయన కుమారుడైన 'జగన్‌' నాయకులు ఆ అధికారిపై బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. నిన్నటి వరకు ఆ ఒక్క అధికారినే టార్గెట్‌ చేసిన విపక్షాలనాయకులు..తాజాగా మరో ఇద్దరిపేర్లు తెరపైకి తెచ్చారు. ఇందులోనిజానిజాలు ఎంత వరకు ఉన్నాయో కానీ..ఈ అధికారులను భ్రష్టుపట్టిపోవడానికి కారణం..మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి అని చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరో కొద్దినెలల తరువాత ఈ అధికారిని నియమించడం ఖాయమని తెలిసిన కొంత మంది ఐఎఎస్‌ అధికారులు, వారిని వెనుకనుంచి ప్రోత్సహించిన రిటైర్డ్‌ అధికారులు, ఒక పథకం ప్రకారం ఆరోపణలు, విమర్శలు చేయిస్తున్నారు. కేంద్ర సర్వీసులో పనిచేసినప్పుడు కూడా ఆ అధికారి చేతికి అవినీతి మట్టి అంటలేదీ. అక్రమాలకు పాల్పడినట్లు రుజువులు జాతీయపత్రికలు కూడా కథనాలు ప్రచురించలేదు. ఇటీవల కాలంలో ఆ అధికారిపై ఒక పత్రిక పనికట్టుకుని వ్యతిరేక ద్రుష్పచారాలతో కథలు..కథలుగా ప్రచురిస్తోంది. దీనికంతటికీ మూల కారుకులెవరూ పాలకులు తెలుసుకోలేకపోతున్నారు. ఇంటిలిజెన్స్‌ విభాగం అధికారులు దృష్టిపెట్టడం లేదు. ఒక అధికారిపై పదే పదే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా..స్పందించాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో..ఐఎఎస్‌ అధికారులకు అంతుపట్టడం లేదు. ఇదే విషయంపై కొంత మంది అధికారులను 'జనంప్రత్యేకప్రతినిధి' కలిసినప్పుడు మొదట స్పందించేందుకు నిరాకరించినా..వారిలో కొందరు..అసలువారే మౌనం వహిస్తే..కొసలువాళ్లు అయిన తామెందుకు స్పందిస్తాం..ఒక్కమాట నిజం..ఆ నిజమేమిటంటే..ఎమ్మెల్యేల కొనుగోలులో..ప్యాకేజీలుమాట్లాడడం..సిఎంఒ అధికారవర్గాల పాత్ర ఉందంటే..ఎవరూ నమ్మడంలేదు. ఇటువంటి వాటిలో సిఎం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో సిద్దహస్తుడు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో చంద్రబాబుకు తెలిసినంతగా..మిగతా వారికి తెలియదు. 

   ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీ కాలం పూర్తి అయిన తరువాత ఆ అధికారిని ప్రధాన కార్యదర్శిగా నిమయిమంచడానికి తోసిపుచ్చడం లేదు. ఆయనను సిఎస్‌గా నియమించడం ఇష్టం లేక..ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. కానీ బాహాటంగా మాట్లాడలేం. ఏది ఏమైనా ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిపై ఇటువంటి విమర్శలు ఎవరూ చేయలేదు. 'విజయసాయిరెడ్డి' కీలకపాత్ర పోషించడం తమకు ఆశ్చర్యం కలిగించింది. అటువంటి మేధావి ఇటువంటి విమర్శలు చేస్తారా..? ఎందుకు సిఎంఒపై టార్గెట్‌ చేస్తున్నారు..వారికి ఒరిగేదేమీటి అనేదానిపై ఎవరికీ తెలియడం లేదని..దీన్ని బయటకు తీయాలిసని అధికారి చెబుతున్నారు. విజయసాయిరెడ్డే బాహాటంగా వెల్లడించారు. ఆయన ఎవరో కాదు..ఆయన పేరు 'సతీష్‌' ఆయన ప్రస్తుతం సిఎంఒ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విమర్శలు, వివాదాలు ఇంతటితో ముగిసిపోతాయా..? మళ్లీ విజయసాయిరెడ్డి అదే బాటలో నడుస్తారా...? లేక మౌనం వహిస్తారా..? దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ విధంగా స్పందించబోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు..విజయసాయిరెడ్డి ఆరోపణలను, విమర్శలను సకాలంలో తిప్పికొట్టకుండా..చేతులు కాలక ఆకులుపట్టుకున్న చందాన మొక్కుబడి విమర్శలు చేసి చేతులు దులుపుకున్నారు. మరి కొద్ది రోజులు గడిస్తే కానీ..ఏం జరగబోతుందో బయటపడదు.


(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ