WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ్యసభ రేసులో 'జయప్రకాష్‌నారాయణ'...!

లోక్‌సత్తా..వ్యవస్థాపక అధ్యక్షుడు 'జయప్రకాష్‌నారాయణ' రాజ్యసభ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ రోజు ప్రకటించడంతో..తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ పార్టీకి శాసనసభలో ఉన్న బలంతో రెండు సీట్లును గెలుచుకోగలుగుతుంది. దీనిలో ఒకటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు ఇస్తారని ప్రచారం జరుగుతుండగా..మరొక స్థానం కోసం పార్టీలో గట్టిపోటీ నెలకొని ఉంది. అయితే ఊహించని విధంగా లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు 'జయప్రకాష్‌నారాయణ'ను 'చంద్రబాబు' రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా..'జెపి' 'చంద్రబాబు'తో సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని...'జెపి' ఇటీవల కాలంలో గట్టిగా చెబుతున్నారు. అదే సమయంలో..ఇప్పుడున్న పరిస్థితుల్లో 'చంద్రబాబు' తప్ప..మెరవరూ..ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేరని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా 'పోలవరం' ప్రాజెక్టు శరవేగంగా పూర్తి అవుతుందని, కేంద్రం సహకరిస్తే..'చంద్రబాబు' దాన్ని ఎన్నికలకు ముందే పూర్తి చేయగలుగుతారని చెబుతున్నారు. ఇటీవల 'పవన్‌కల్యాణ్‌' ఏర్పాటు చేసిన కమిటీలో క్రియాశీలకంగా 'జెపి' వ్యవహరిస్తున్నారు. దరిమిలా..ఇప్పుడు...'రాజ్యసభ'కు 'జెపి'ని పార్టీలకు అతీతంగా నామినేటెడ్‌ చేయాలని భావిస్తున్నట్లు అమరావతిలో ప్రచారం జరుగుతోంది. 

  రాజ్యసభలో ఆంధ్రా తరుపున, ఆంధ్ర ప్రయోజనాల కోసం 'జెపి' పోరాడతారని...ఆయనకు రాజ్యసభ ఇస్తే బాగుంటుందని..చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. కాగా..టిడిపిలో 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన వారు తమకు రాజ్యసభ సీటు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఈ కోటాలో 'జెపి'ని ఖరారు చేస్తే..మూడో సీటుకు పోటీ పెడితే...ఆ సీటును ఎస్సీలకు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో..అభ్యర్థిత్వం కోసం పలువురు 'చంద్రబాబు'ను కలుస్తున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే సిఐఐ సదస్సు అయిన తరువాతనే 'చంద్రబాబు' దీనిపై దృష్టిసారిస్తారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.


(1462)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ