WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హోదా అడిగితే..మరోసారి ముక్కలు చేస్తాం...!

ఇచ్చిన హామీలు అమలు చేయమని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిగ్గదీసి అడుగుతుంటే...ఏమి చేయాలో పాలుపోని..కేంద్ర ప్రభుత్వ పెద్దలు మరో కుట్రకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇంతకు ముందు విభజించి..సగం చేసిన...బిజెపి,కాంగ్రెస్‌ పాలకులు..తాజాగా..మరోసారి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగా..ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని రగిలించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. 'రాయలసీమ'కు అన్యాయం జరిగిందని,రాజధానిని లాక్కున్నారని..తమ రాజధాని తమకు కావాలని, రాష్ట్ర బడ్జెట్‌లో 'రాయలసీమ'కు రూ.20వేల కోట్లు ఇవ్వాలని బిజెపి తన పెంపుడు కుక్కలతో అరిపిస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే...మరోసారి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామని బెదిరిస్తోంది. ఇప్పటికే..రంగం సిద్ధం చేశామని..కేంద్రం నుంచి..మేము ఇచ్చింది..తీసుకోవాలి..తప్ప...డిమాండ్‌ చేస్తే..ఊరుకోబోమని.. బిజెపి పెద్దలు హెచ్చరిస్తున్నారు.

  నాలుగేళ్ల క్రితం..రాజకీయ కుట్రకు బలైన ఆంధ్రప్రదేశ్‌..ఇప్పుడు...బిజెపి నయవంచనకు మరోసారి బలికాబోతున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగడమే నేరమట. హామీలు అమలు చేయకపోయినా..రాజధాని లేకపోయినా..పోలవరం పూర్తి కాకపోయినా...వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించక పోయినా..కేంద్ర సంస్థలు..ఏర్పాటు చేయకపోయినా...వాళ్లు వేసిన ముష్టి తీసుకుని...వెళ్లాలి తప్ప..నోరెత్తితే..వేటు వేస్తామని..బెదిరించడం..దీనికి కొంత మంది ద్రోహులు తలలాడించడం.. చూస్తుంటే...స్వంత లాభం కోసం..ఎటువంటి పనైనా చేయడానికి బిజెపి పెద్దలు సందేహించరని జరుగుతున్న పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. నాడు తెలంగాణ వెనుకబడిందని..ద్రోహం జరిగిందని..విభజనతోనే సమస్త సమస్యలు పరిష్కారమవుతాయని..విభజన చేసి ఆంధ్రాకు అన్యాయం చేసిన నేతలే మరోసారి..విభజన కుట్రకు సర్వం సిద్దం చేశారు. ఇటువంటి ద్రోహులను సరైన సమయంలో అడ్డుకోకపోతే..మరోసారి ఆంధ్రాకు తీరని నష్టం జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. విజ్ఞులైన ఆంధ్రా ప్రజలు..ఇటువంటి కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే విభజనతో నష్టపోయిన..సగటు ఆంధ్రావాసి నెత్తిన మరో విభజన కత్తి వేలాడుతోంది. తస్మాత్‌ జాగ్రత్త...!


(609)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ