WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సమయాన్ని వృధా చేసుకుంటే వెనుక్కుపోతాం:రామాంజనేయులు

కన్నతల్లి లాంటి జిల్లా అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో బాధ్యతలు నిర్వహించాలని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌ బి.రామాంజనేయులు కోరారు. అభివృద్ధి పనులను సకాలంలో నిర్వహించకపోతే..కొన్ని ఏళ్లు వెనక్కుపోతారని 'రామాంజనేయులు' హెచ్చరించారు. ప్రగతి ప్రథంలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో..నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారని ఆయనను స్పూర్తిగా తీసుకుని తాము కూడా అదే బాటలో నడుస్తున్నామని..మీరు కూడా అదే స్పీడును అనుసరించగలిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కోలా పనిచేస్తూ ముందుకు వెళుతుందని, తెలుగుదేశం ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు దూసుకెళుతుందని చెప్పారు. 2006 సంవత్సరం నుంచి ఉపాధిహామీ పథకం అమలులో ఉన్నా..ఈ మూడేళ్లలో జరిగిన అభివృద్ధి గతంలో జరగలేదన్నారు. 

  ప్రతి కుటుంబం నెలకు పదివేల రూపాయల ఆదాయం పొందేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని..ఇందు కోసం ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించడం జరిగిందన్నారు. గ్రామాలకు లెవన్‌స్టార్‌ రేటింగ్‌ పెట్టి అభివృద్ధిలో పోటీతత్వం తీసుకువచ్చామని, ప్రతిపంచాయితీకి 20లక్షలు అందుతాయని,ఉపాధి పనులు పెద్ద ఎత్తున్న చేపట్టడం ద్వారా 80లక్షలు సమకూర్చవచ్చునని చెప్పారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ చేస్తామని 2వేల లోపు జనాభా ఉంటే..ప్రతి ఇంటికి మ్యాజిక్‌ షోర్‌పీట్‌ నిర్మిస్తామని దీనికి రూ3500 ఇస్తామని ఇప్పటి నుండి ప్రతి నెల మొదటి శనివారం విద్యా,ఆరోగ్యం,ఐసిడిఎస్‌లపై సమీక్ష చేస్తామని ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని రామాంజనేయులు చెప్పారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న మూడేళ్ల నుండి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో అంత వేగంగా జరగలేదని, తనతో పాటు కిందిస్థాయి అధికారులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చారని చెప్పారు. సమావేశానికి వివిధ శాఖల నుండి ఉద్యోగులు,సిబ్బంది భారీ ఎత్తున హాజరయ్యారు. భారతదేశంలో కల్లా ఉపాధి పనుల్లో ప్రథమస్థానం పొందడంలో అధికారుల కృషి ఎంతో ఉందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను సకాలంలో రాబట్టడంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోడ్పాటుతో..తాను రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి సంబంధించిన అధికారులతో నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయించామని, రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులపై కేంద్ర అధికారులు కితాబు ఇచ్చినట్లు రామాంజనేయులు తెలిపారు.

(320)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ