WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ్యసభ వద్దు...మంత్రి పదవే 'యనమల'కు ముద్దు...!

నిన్నటి వరకు రాజ్యసభకు వెళ్లాలని కోరుకున్న ఆర్థిక మంత్రి 'యనమల రామకృష్ణుడు' ఇప్పుడు వద్దునుకుంటున్నారట. ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఏ మార్పులు వచ్చాయో కానీ...రాజ్యసభ వద్దు...మంత్రిగా కొనసాగాలని భావిస్తున్నారట. ఇదే విషయంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడును 'జనం ప్రత్యేక ప్రతినిధి' ఆరా తీయగా.. ముందు తడపాయించినా...ఆ తరువాత 'యనమల' ఆలోచనను వివరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం..తనకు మళ్లీ మంత్రి పదవి దక్కుతుందని...అందుకే మళ్లీ రాజ్యసభ వద్దని మంత్రిగానే కొనసాగడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. అంతే కాకుండా రాజ్యసభకు వెళ్లి చేసేదేముంది..మంత్రి పదవి ఇవ్వరు..బిజెపితో పొత్తు ఉండదు..కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే...అక్కడ చేసేదేమీ ఉండదని..దాని కన్నా రాష్ట్రంలో మంత్రిగానే కొనసాగాలని భావిస్తున్నారని వివరించారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులు 'యనమల'ను రాజ్యసభకు వెళ్లవద్దని చెప్పారట. ఇటీవల కాలంలో 'యనమల' కుటుంబసభ్యుల ఒత్తిడికి లొంగుతున్నారని, అందుకే వారి మాటలను విన్నారని..చెబుతున్నారు. నిన్న..మొన్నటి వరకు 'యనమల' రాజ్యసభకు వెళ్లి తన కుమార్తెను కాకినాడ నుంచి పోటీ చేయించాలని భావించారు. ఇటీవల ఏ సర్వే చూసినా..మళ్లీ టిడిపి అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయంతో ఉండడంతో..రాజ్యసభ వదులుకుని..మంత్రిగా కొనసాగడానికే..మొగ్గు చూపుతున్నారట. ఈ విషయాన్ని నేడో..రేపో 'చంద్రబాబు'దృష్టికి తీసుకెళతారని...ఆ వర్గాలు చెబుతున్నాయి.

(208)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ