WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఏడు లక్షల కుటుంబాలకు తాగునీరు...!

కృష్ణా జిల్లా యంత్రాంగం మరో ఘనతను సాధించబోతోంది. జిల్లాలో మంచినీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి తాగునీరు అందించే పథకానికి రంగం సిద్ధం చేసింది. రాబోయే ఎనిమిది మాసాల్లో జిల్లాలోని ప్రతి కుటుంబం తాగునీటి కనెక్షన్‌ను పొందబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దాదాపు రూ.860కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. దీని కోసం ఇప్పటికే..టెండర్లను ఆహ్వానించారు.

  మారుమూల గ్రామాల్లోని కుటుంబాలు రక్షిత మంచినీటి సౌకర్యం లేక వివిధ రకాలైన వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఫ్లోరైడ్‌బారిన పడుతున్నారు. దీన్ని నివారించడానికి జిల్లా యంత్రాంగం ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఎస్‌టి గ్రామాలు, ఎస్‌.సి., బిసి కాలనీల్లో తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఏప్రిల్‌లో దీనికి కోసం టెండర్లు పిలవబోతున్నారు. అది ఫైనల్‌ కావడంతోనే పనులు ప్రారంభం అవుతాయని 6-8 నెలల్లో ఈ పనులు పూర్తి అవుతాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రతి గ్రామంలో వాటర్‌ట్యాంక్‌ నిర్మాణం, పైప్‌లైన్ల నిర్మాణం శరవేగంతో పూర్తి చేసి గ్రామంలోని ప్రతి కుటుంబానికి తాగునీరు వసతి కల్పించబోతున్నారు.

  ఇదే విషయంపై జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం స్పందిస్తూ..ఈ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఈ పథకంపై ఇప్పటికే సర్వే చేశామని ఏప్రిల్‌ నాటికి టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెడతామని తెలిపారు. కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టును ఆరంభించడంపై తాను సంతోషిస్తున్నానని, ఎస్‌టి,ఎస్‌సి, బిసి కాలనీలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.

(82)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ