WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు...!

28వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ మొదటి,రెండవ సంవత్సర పరీక్షలు సీసీ కెమెరాల నీడలో జరగబోతున్నాయి. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే ఉన్నతాధికారులు బాధ్యతగల అధికారులతో చర్చించారు. జిల్లాస్థాయిలో జాయింట్‌ కలెక్టర్లు, సంబంధిత అధికారులతో చర్చించి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులందరూ ఉదయం 8.30గంటలకే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి. 9గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా ఏ ఒక్కరినీ పరీక్ష రాసేందుకు అనుమతించరు. రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులు పరస్పరం సహకరించుకుని సమన్వయంతో బాధ్యతలు నిర్వహించాలని సమావేశంలో ఉన్నతాధికారులు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ విధించబోతున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంత పరిధిలోని జిరాక్స్‌ సెంటరలన్నీ మూసివేయించాలని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లును ఆదేశించారు. పరీక్ష జరిగే సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని..ఆ ప్రాంతంలోని బాధ్యతగల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులను పరీక్షా కేంద్రాలను అనుగుణంగా నడిపేందుకు రంగం సిద్ధమైంది. ఏ పరీక్షా కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా..సిసి కెమెరాలు..ఇతరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు  స్పెషల్‌ స్వాడ్‌లును నియమించారు. వీటిన్నింటిని తనిఖీ చేసేందుకు హైపవర్‌ కమిటీ, ఆఐఒ బృందాలు పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తారు. ఏ పరీక్షా కేంద్రంలోనైనా..ఇన్విజిలేటర్లు సమయానికి రాకపోయినా.. అధికారులు వెంటనే స్పందించి ఏ కేంద్రంలో అయితే ఈ పరిస్థితి ఏర్పిడిందో..ఆ ప్రాంత ఉపాధ్యాయులను నియమించి వారి సర్వీసు వినియోగించుకోవచ్చని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ప్రశ్నా పత్రాలను తీసుకువచ్చే సమయంలో పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అత్యవసర మందులు, వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒక ఉద్యోగిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించారు. 

  ఎవరెవరికి ఏయే సెంటర్లు కేటాయించారో అనే దానిపై ఇంటర్‌బోర్డు ఒక యాప్‌ను కూడా రూపొందించిందని..దీనికి వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ యాప్‌ను గూగుల్‌ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, తనకు కేటాయించిన సెంటర్‌ను ఎంటర్‌ చేస్తే..విద్యార్థికి ఆ పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది..ఎంత సమయంలో వెళ్లవచ్చు..ఏ దారిన వెళ్లవచ్చు..అనేది చూపిస్తుంది. విద్యార్థుల హాల్‌టిక్కెట్లు అన్నీ నెట్‌లో ఉంచామని..వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లవచ్చునని..అధికారులు చెప్పారు. మాస్‌కాపీయింగ్‌కు, ప్రలోభాలకు, లంచాలకు పాల్పడవద్దు..సిసి కెమెరాలతో పాటు..వివిధ తనిఖీల బృందాలు..ఎప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారో తెలియకుండా వివరాలు గోప్యంగా ఉంచారు. ప్రైవేట్‌ కళాశాలల విద్యాసంస్థల ప్రతినిధులు ఎక్కడైనా కనిపిస్తే..ముందు హెచ్చరించండి..తరువాత..కేసులునమోదు చేయండి...అని అధికారులు సూచిస్తున్నారు. తొమ్మిది గంటలు దాటితే..అనుమతించం..అని పదే పదే విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ..మొదటి సంవత్సరం, ఇంటర్‌ పరీక్షలకు అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తూ..ఎటువంటి అవకతవకలు జరగకుండా..సమర్థులు, నిజాయితీపరులైన తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వీటి పనితీరు పరీక్షలు అయిన తరువాత ఏ విధంగా తెలుస్తోంది.


(114)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ