WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణా జిల్లా కలెక్టర్‌పై సిఎం ప్రశంసల జల్లు....!

ప్రజాసమస్యలపై స్పందించే కలెక్టర్‌గా, పనిచేసే కలెక్టర్‌గా, ప్రజల కలెక్టర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకుని పలువురు ప్రశంసలు పొందిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రశంసలు కురిపించారు. నగరంలో కాలుష్య నియంత్రణకు కృష్ణా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో కాలుష్య నియంత్రణపై జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతంతో సమీక్షించారు. ఎయిర్‌ క్వాలిటీ, వాటర్‌ క్వాలిటీ పరంగా జిల్లా యంత్రాంగం చేసిన చర్యలు భేష్‌గా ఉన్నాయని, వీటిని ఇతర జిల్లాలు ఆదర్శంగా తీసుకుని చేపట్టాలని ఆయన ఆదేశించారు. 

  విజయవాడలో ప్రతి ఇంటికి, ప్రతి షాప్‌కు మొక్కలను పంపిణీ చేస్తున్నామని దీంతో ప్రజలకు స్వచ్చమైన గాలి అందిస్తామని తెలిపారు. ప్రతి మొక్క 260 ఫౌండ్ల ఆక్సిజన్‌ అందిస్తుందని, 48 ఫౌండ్ల కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుందన్నారు. కాలుష్యం వెదజల్లే 468 వాహనాలపై కేసులు నమోదు చేసి అపరాద రుసుం విధించామని, అదే విధంగా 8 వాహనాలను సీజ్‌ చేశామని కలెక్టర్‌ ఈ సందర్భంగా వివరించారు. విజయవాడ నగరంలో దుమ్మూ,ధూళి శాతం 102 మైక్రో గ్రాముల నుండి 83 మైక్రో గ్రాములకు తగ్గిందని కలెక్టర్‌ తెలిపారు. నగరంలో ప్రతి రోడ్డు పరిశుభ్రంగా ఉంచేలా స్వీపింగ్‌ మిషన్ల ద్వారా శుభ్రం చేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన పలు చర్యవల్ల నగరంలో భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నా..కాలుష్యం పెద్దగా లేదని..దాన్నినియంత్రిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే పలు అంశాలపై నెంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్న జిల్లా ఇప్పుడు కాలుష్య నియంత్రణలో నెంబర్‌వన్‌ స్థానం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

(596)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ