WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు:కలెక్టర్‌ లక్ష్మీకాంతం

కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం నాడు ఆయన క్యాంప్‌ కార్యాలయం నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు. వేసవిలో 970 గ్రామ పంచాయితీల్లో అవరమైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, వీటితో ఆయా గ్రామ పంచాయితీల్లో మోటార్‌ రిపేర్లు, వీధిదీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య, పరిస్థితిని ఎస్‌ఇ ఆర్‌డబ్ల్యుఎస్‌, డీపీఓ, సీఈఓ జడ్‌పి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మండల స్థాయిలో అధికారులు కమిటీగా ఏర్పడి తాగునీటి పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. 

  గూడూరు, అవనిగడ్డల్లో సకాలంలో తీసుకున్న చర్యల వల్ల మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలకు సకాలంలో నీరు అందించగలిగామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి లేబర్‌ బడ్జెట్‌నులక్ష పనిదినాలకు పెంచాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో పాడైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను పెంచి పోషించే చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలని, ఓడీఎఫ్‌ ప్లస్‌ జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో రోడ్‌ సేఫ్టీ డెవలప్‌మెంట్‌ నిధులు కోటి రూపాయలను ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందన్నారు. జిల్లాలో భూగర్భ జలాల శాతం పెంచేందుకు చేపట్టిన జలసంరక్షణ చర్యల్లో భాగంగా 3500 పనులు ఇరిగేషన్‌ శాఖ ప్రతిపాదనలు పంపగా వాటిలో 2వేల పనులు మంజూరు చేశామని, వాటిలో 1400 పనులు ప్రారంభించామని తెలిపారు. 

(172)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ