WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణా జిల్లాలో మార్చి1 నుంచి ఈ-ఆడిట్‌...!

మార్చి1వ తేదీ నుంచి జిల్లాలో ఈ-ఆడిటింగ్‌కు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి1వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయితీల్లో ఈ-ఆడిట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్‌ అథెంటికేషన్‌ విధానంతో ప్రత్యేక ట్యాబ్‌ ద్వారా పంచాయితీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు, లబ్దిదారులకు పెన్షన్‌ అందించాలన్నారు. జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు ఎక్కడైనా ఎండిపోతే వాటి స్థానంలో నూతన మొక్కలను ఏర్పాటు చేసి సంరక్షించాలన్నారు. జిల్లాలోని 2300 చౌక ధరల దుకాణాల్లో కుండీల్లో మొక్కలు పెంచాలని డీఎస్‌ఒ నాగేశ్వరరావును ఆదేశించారు. 

   అదే విధంగా ప్రతి పెట్రోలు బంక్‌లోనూ కుండీల్లో మొక్కలుపెంచాలన్నారు. మొక్కలుపెంచని పెట్రోల్‌ బంక్‌ యజమానులకు రూ.10వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మద్యం దుకాణాలపై విస్తృత దాడులు నిర్వహించి అధికశాతం మద్యం ఉంటే సంబంధిత దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి నెల 5వ తేదీన మండలాల్లో ఆర్డీఓలు, గ్రామాల్లో తాశీల్దార్లు ఆహార భధ్రతా కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఎడ్వైజర్‌ కమిటీ సమావేశాలను నిర్వహించాలన్నారు. స్త్రీనిధి, బ్యాంక్‌ లింకేజీ రుణాల పంపిణీలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈసమావేశంలో జెసి-2 పిడిగు బాబూరావు, డీఆర్‌డిఎ పిడీ చంద్రశేఖరరాజు, ఎస్‌ఎస్‌ఎ పీఓ ప్రసాద్‌, డ్వామా ఎపీడీ జివి సూర్యనారాయణ, డీఇఓ రాజ్యలక్ష్మి, హౌసింగ్‌ పీడీ ఎస్‌విఆర్‌ ప్రసాద్‌, ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ ఇడీలు ఎన్‌వివి సత్యనారాయణ, పెంటోజీరావు, బీసీ వెల్పేర్‌ డీడీ యుగందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

(91)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ