WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అంబటి'కి టిక్కెట్‌ లేనట్లే...!?

గుంటూరు జిల్లా నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త 'అంబటి రాంబాబు' 2014లో సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మళ్లీ తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెబుతున్నారట. ఇక్కడ నుండి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కానీ..ఆయన వారుసులెవరైనా రంగంలో ఉంటే 'అంబటి'పై అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వైకాపా అభిమానులే చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో వెయ్యికోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను డాక్టర్‌ కోడెల చేపట్టారు..స్థానికంగా ఒకరిద్దరిపై అసంతృప్తి ఉన్నా స్పీకర్‌ కోడెల అసంతృప్తి లేదని, టిడిపి నాయకులు, కార్యకర్తలతో పాటు వైకాపా నాయకులు కూడా చెబుతున్నారు. 2004,2009లో విజయంసాధించిన 'వెంకటేశ్వరరెడ్డి'ని మళ్లీ పోటీ చేయించాలని 'జగన్‌' భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అంబటి రాంబాబు అయితే ఘోరంగా ఓడిపోతారని, వెంకటేశ్వరరెడ్డి అయితే గట్టి పోటీ ఇస్తారని పికె సర్వే ద్వారా 'జగన్‌' తెలుసుకున్నారు.

 ఈ నేపథ్యంలో రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న...'కోడెల'ను ఢీ కొనాలన్నా... ఓడించాలన్నా..'అంబటి' వల్ల కాదని..ఆయన కన్నా 'వెంకటేశ్వర్‌రెడ్డి' అయితేనే సాధ్యమవుతుందని పికె ఇచ్చిన నివేదికలో తేలిందని, ఏదో విధంగా 'వెంకటేశ్వరరెడ్డి'ని పోటీ చేయించేందుకు ఒప్పించాలని, స్థానికంగా ఉండే వైకాపా నేతలు..అధినేత 'జగన్‌' ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. నియోజకవర్గంలో 'అంబటి' లేక వెంకటేశ్వర్‌రెడ్డి పోటీ చేసినా..తమ డాక్టర్‌ను ఓడించడం కష్టమని..ఏ ఊరు వెళ్లినా..ఎక్కడికి వెళ్లినా..ప్రజలు ఆయనకు నీరాజనం పడుతున్నారని టిడిపి నాయకులు చెబుతున్నారు. వైకాపా అభ్యర్థిగా 'అంబటి'ని తప్పించి...'వెంకటేశ్వర్‌రెడ్డి'ని పెడతారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎప్పుడో 1989లో రేపల్లె నుంచి విజయం సాధించిన 'అంబటి' మరెక్కడా కానీ విజయం సాధించలేకపోయారు. వెంకటేశ్వరరెడ్డికి ఈ నియోజకవర్గంలో 'చంద్రబాబు' సామాజికవర్గ ఓటర్ల మద్దతు కూడా ఉందని, ఆయన వారికి ఎన్నో పనులు చక్కపెట్టారని, పలువురు నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. దీనిని బట్టి 'అంబటి'కి టిక్కెట్‌ ఇవ్వరని వైకాపా నాయకులు, కార్యకర్తల నమ్మకం. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!

(349)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ