WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్యేగా 'కోడెల' కుమార్తె...!

రాజకీయాలలో అపార అనుభవంతో పాటు..అన్నివర్గాల వారిలో ఆదరాభిమానాలున్న.. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఈసారి సత్తెనపల్లిలో పోటీ చేయకుండా నర్సరావుపేటలో పోటీ చేస్తే..ఆయన కుమార్తె విజయలక్ష్మి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని..పార్టీ వర్గాలు సర్వే నిర్వహించాయి. ఈ నియోజకవర్గంలో 'కోడెల' గెలుపుకు ఎటువంటి ఢోకా లేదని, ఆయన స్థానంలో కుమార్తె విజయలక్ష్మి పోటీ చేసినా విజయం సాధిస్తారని టిడిపి స్థానిక నాయకులు, కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. కానీ ఒక ఇంటిలో ఇద్దరికి పోటీ చేసే అవకాశం 'చంద్రబాబు' కల్పించరని కొందరు..కల్పిస్తారని మరి కొందరు పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో 'కోడెల' పోటీ చేస్తే ఆయన గెలుపు ఖాయమని..సత్తెనపల్లిలో ఆయన ఎవరిని నిలబెట్టినా గెలుస్తారని, స్థానిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 'కోడెల' తన కుమార్తెను బరిలోకి దింపితే..ఓటర్లు ఆమెను ఆదరించడం ఖాయమని..కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

   నియోజకవర్గంలో 'విజయలక్ష్మి'కి తండ్రి వలే పేరుప్రతిష్టలు ఉన్నాయని..ఆమె పలు కార్యక్రమాలకు, సమావేశాలకు హాజరవుతున్నారని..ప్రజల్లో ఆమెపై ఎటువంటి వ్యతిరేకత లేదని సీనియర్‌ కార్యకర్తలు చెబుతున్నారు. 'కోడెల' కుటుంబంలో 'చంద్రబాబు' ఇద్దరికి టిక్కెట్లు ఇస్తారా..? ఒక వేళ ఇద్దరికీ ఇస్తే..కోడెల తన కుమార్తె 'విజయలక్ష్మి'ని పోటీకి నిలుపుతారా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే విషయంపై కొందరు 'కోడెల'ను ప్రశ్నించగా...'తానే సత్తెనపల్లిలో పోటీ చేస్తాను..కుటుంబ సభ్యుల గురించి తాను ఆలోచించడం లేదని...అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెబుతున్నారట. కానీ..ఈ విషయంలో 'చంద్రబాబు' తుది నిర్ణయం ఎలా ఉంటుందో..? గెలిచే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తానని ఎప్పటి నుంచో చెబుతున్న 'చంద్రబాబు'..సత్తెనపల్లిలో 'కోడెల' కానీ..ఆయన కుమార్తె కానీ గెలుస్తారని భావిస్తే..ఒకరికి నర్సరావుపేట మరొకరికి సత్తెనపల్లి టిక్కెట్‌ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. 

(818)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ