WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఉపఎన్నికల్లో 'బిజెపి'కి ఘోరపరాజయం...!

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయం పాలైంది. ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన మూడు స్థానాల్లోనూ బిజెపి పరాజయం పాలైంది. ఒడిశా రాష్ట్రంలోని బీజ్‌పూర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బిజెడి అభ్యర్థి రీటా సాహు ఘనవిజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి అయిన బిజెపి అభ్యర్థిపై దాదాపు 42వేలపైగా ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుబుల్‌ సాహు మరణించడంతో..ఇక్కడ ఎన్నిక నిర్వహించారు. ఆయన భార్య బిజెడి అభ్యర్థిగా రంగంలోకి దిగి..విజయదుందుభి మోగించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విలేకరులతో అన్నారు. కాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార బిజెపి పరాజయం పాలయింది. రాష్ట్రంలోని ముంగాలీ,కొలారస్‌ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయంసాధించారు. నవంబర్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బిజెపి రెండుచోట్ల పరాజయం పాలవడంపై అధికార పార్టీలో కలవరం మొదలైంది. వరుసగా ఇక్కడ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న చౌహాన్‌కు రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదని ఈ ఫలితాలతో తేలిపోతోంది. మొత్తం మీద..హిందీ బెల్ట్‌లో 'మోడీ' ప్రభ ఒడిగడుతోందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

(179)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ