WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'ను బుజ్జగిస్తున్న 'బిజెపి' పెద్దలు...!

ఆంధ్రాకు ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో ఎన్‌డిఎ నుంచి తాము వైదొలుగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హెచ్చరికలతో కేంద్ర పెద్దల్లో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని...తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని 'చంద్రబాబు'ను ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వేడుకుంటున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు రాత్రి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఇంట్లో జరిగిన సమావేశానికి 'అమిత్‌షా' హాజరయ్యారు. ఈ సమావేశంలోనే టిడిపి ఎంపీలు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు 'కుటుంబరావు'లు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు...అమిత్‌షాతోనూ..టిడిపి ఎంపీలతోనూ చర్చలు నిర్వహించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే...ఎన్‌డిఎ కుప్పకూలిపోతుందని 'వెంకయ్య' హెచ్చరించినట్లు తెలిసింది. 'ఆంధ్రా'కు అన్యాయం చేస్తే..దాని ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంటుందని...నమ్మకమైన మిత్రున్నిపోగొట్టుకోవద్దని 'వెంకయ్య' హితవు చెప్పినట్లు...తెలుస్తోంది. ఇప్పటికైనా...సిఎం చంద్రబాబునాయుడును మెప్పించే చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఆలస్యం జరిగిందని...చంద్రబాబు పెట్టిన గడువు దగ్గరకు వస్తుందని..ఈ లోపు..ఏ చర్యా తీసుకోకపోతే...మార్చి5నే టిడిపి మంత్రులు పార్లమెంట్‌లో రాజీనామా చేయడం ఖాయమని..దాంతో...ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందని..అటువంటి ఇబ్బంది రాకుండా వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు సుధీర్ఘంగా 'అమిత్‌షా'కు హితబోధ చేసినట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. 

    'వెంకయ్యనాయుడు' చెప్పిన మాటలను ఆలకించిన 'అమిత్‌షా' పాత పాటే పాడినట్లు తెలుస్తోంది. ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని..టిడిపి ఎంపీలు తొందరపడి ఎటువంటి రాజీనామాలు చేయవద్దని ఆయనకోరారని..అయితే..తమకు నిర్దిష్టమైన హామీలు వెంటనే ఇవ్వాలని..పార్లమెంట్‌లో తమకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలని..తాము కోరుతున్న 19 అంశాలపై ప్రధాని మోడీ స్పందిస్తేనే...తాము 'చంద్రబాబు'తో చర్చించగలమని టిడిపి ఎంపీలు ఆ సమావేశంలో చెప్పారట. మొత్తం మీద కేంద్రంపై 'చంద్రబాబు' చేస్తోన్న ఒత్తిడి ఫలించబోతుందని..ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే...మోడీ, అమిత్‌షాలను నమ్మలేమని..వారు గతంలోనూ ఇదే విధంగా చెప్పారని..చివరకు..ఒట్టిచేతులే చూపారని..మళ్లీ అదే విధంగా చేయరనే నమ్మకం తమకు లేదని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఒకవేళ మళ్లీ అదే విధంగా వారు వ్యవహరిస్తే..తాము చేయాల్సింది చేస్తామని టిడిపి నాయకులు చెబుతున్నారు. చూద్దాం..ఏమి జరుగుతుందో..!?


(1212)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ