WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ్యసభకు ఆంధ్రజ్యోతి...'రాధాకృష్ణ'....!?

అధికార తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్లు కోసం నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటుంటే...ఇప్పుడు పత్రికాధిపతులు కూడా తామూ రేసులో ఉన్నామని చెబుతున్నారట. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టిడిపికి రెండు సీట్లు గ్యారెంటీగా లభిస్తాయి. మరో సీటుకు పోటీ పెట్టాలా...? లేక..వైకాపాకు వదిలేయాలా..? అన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతుండగా...పార్టీకి లభించే రెండు సీట్ల కోసం పార్టీలో చాంతాడంత లిస్టు పెండింగ్‌లో ఉండగానే..తటస్థుల కింద మరి కొంత మంది తమకు సీటు కావాలని కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సిఎం రమేష్‌ మరోసారి తనకు ఇవ్వాలని అధినేతను కోరుతుండగా..ఆయనకు వద్దని కడప జిల్లా టిడిపి నాయకులు అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయన కాకుండా ఆర్థిక మంత్రి 'యనమల రామకృష్ణుడు, రిలయన్స్‌ మాధవ్‌,కంభంపాటి రామ్మోహన్‌రావు, జూపూడి ప్రభాకరావు, వర్ల రామయ్య, ప్రతిభాభారతి తదితరులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా...ఇప్పుడు మీడియా నుంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనకు ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన వ్యతిరేక మీడియా ప్రచారం ప్రారంభించింది.

    రాజకీయనాయకుడిగా చట్టసభల్లోకి చంద్రబాబు ప్రవేశించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ప్రత్యేక కవరేజీ ఇచ్చాయి. ఆయన రాజకీయ జీవిత విశేషాలను, జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను, ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికయ్యారు..? ఎవరిని ఓడించారు..ఆయనను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సస్పెండ్‌ చేసింది...? ఎన్టీఆర్‌కు..చంద్రబాబుకు మధ్య ఉన్న సంబంధాలు...ఇతర విషయాలపై ప్రత్యేకంగా వారం రోజులపాటు కథనాలు ప్రచురించింది. అంతే కాకుండా..ఆ సంస్థ ఎండి 'రాధాకృష్ణ' 'చంద్రబాబు'తో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. దాదాపు గంటసేపు ఈ ఇంటర్వ్యూ సాగింది. మిగతా ఛానెల్స్‌, పత్రికలు ఇటువంటి ఇంటర్వ్యూలు...చర్చలు నిర్వహించినా..ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా చేసిందని జర్నలిస్టు సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. ఇదంతా 'చంద్రబాబు'ను కాకాపట్టడానికేనని వారిలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాధాకృష్ణను ప్రత్యేకంగా వ్యతిరేకించే జర్నలిస్టులు మాత్రం...'ఆయన' 'చంద్రబాబు'కు డప్పుకొట్టి..రాజ్యసభ సీటు కొట్టేయాలని భావిస్తున్నారని..అందుకే..ఇంత భారీస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. మొదటి నుంచి 'రాధాకృష్ణ' 'చంద్రబాబు' పాట పాడుతున్నారని...ఆయన చేసిన సేవలకు...మెచ్చి.. 'చంద్రబాబు' రాజ్యసభ సీటు కట్టబెడతారని వారు ప్రచారం చేస్తున్నారు. 'జగన్‌' పార్టీకి చెందిన మీడియా..ఈ విషయంలో మరీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పార్టీలో ఇన్నాళ్లూ కష్టపడ్డవారిని కాదని...'చంద్రబాబు' తన భజన చేసిన 'రాధాకృష్ణ'కు రాజ్యసభ సీటు ఇస్తున్నారని ప్రచారం నిర్వహిస్తోంది. మొత్తం మీద...'చంద్రబాబు' మదిలో దీనిపై ఏముందో తెలియదు..కానీ..ఇప్పుడున్న పరిస్థితుల్లో 'రాధాకృష్ణ'కు రాజ్యసభ సీటు ఇవ్వడం అంత ఆషామాషీ కాదు..మరి ఏం జరుగుతుందో..చూడాలి..!


(1587)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ