WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రధాని మోడీకి చెప్పు చూపించిన వ్యక్తి అరెస్టు...!

ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఓ వ్యక్తి ప్రధానికి చెప్పు చూపించాడనే ఆరోపణలతో పోలీసులు  ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. చెన్నైలో డిసెంబర్‌21న ప్రధాని మోడీ..ఓ ప్రారంభోత్సవానికి వెళితే..అక్కడ 'పల్లి' అనే వ్యక్తి ప్రధానికి చెప్పు చూపించాడనే ఆరోపణలతో పోలీసులు స్వచ్చంధంగా ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి  అతన్ని అరెస్ట్‌ చేసి, ఎగ్మోర్‌ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం అతనిపై 15 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే రాజకీయ నాయకులపై లేదా పార్టీ నేతలపై ప్రజలు అసహనం చూపించడం ఇదే తొలిసారి కాదు. తమ నేతలపై ఉన్న అసహనాన్ని ప్రజలు, లీడర్ల దిష్టిబొమ్మలు దహనం చేసి, కూరగాయలు ముఖంపై విసిరేసి, ఇంకు, షూస్‌లు వారిపైకి విసురుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తారు. గతంలో కూడా ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. సెక్యురిటీ సర్కిళ్లను వెనక్కి నెట్టేసి మరీ ఈ ఘటలను పాల్పడుతుంటారు. 



(122)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ