WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిజెపి బ్యాంక్‌స్కామ్‌లపై 'టిడిపి' వైఖరేంటి...!?

తాము పరిశుద్ధలమని, తమకు అవినీతి మరక అంటదని...అవినీతి పరుల అంతం చూస్తామని పదే పదే చెప్పే 'మోడీ' ద్వయం..తాజాగా..దేశ వ్యాప్తంగా బయటపడుతున్న బ్యాంకింగ్‌ స్కామ్‌లపై నోరు మెదపడం లేదు. సామాన్యులపొట్ట కొట్టి...కార్పొరేట్‌శక్తులకు కట్టబెడుతున్నారన్న విమర్శలు, ఆరోపణలను పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్న..బిజెపి పెద్దలు సోమవారం ఈ స్కామ్‌లపై పార్లమెంట్‌లో ఏం సమాధానం చెబుతారనేదానిపై ఆసక్తినెలకొంది. ఇప్పటికే 'రఫెల్‌' కుంభకోణంలో సాక్షాత్తూ ప్రధాని 'మోడీ'కి సంబంధం ఉందని ప్రతిపక్షం విమర్శలు చేస్తుండగా..తాజాగా..బ్యాంకింగ్‌ కుంభకోణాలు ఆయన పరువును తీస్తున్నాయి. బ్యాంకింగ్‌ కుంభకోణాలతో పాటు, కాంగ్రెస్‌ నేతలపై సీబీఐతో అరెస్టు చేయించడం వంటివాటిపై పార్లమెంట్‌సాక్షిగా కాంగ్రెస్‌ భారీ ఎత్తున్న నిరసన వ్యక్తం చేయబోతోంది. తమతో కలసి వచ్చే పార్టీలన్నింటిని కలుపుకుని పార్లమెంట్‌లో 'మోడీ'ని నిలదీయబోతోంది. అయితే..ఈ నిలదీతలో ఇప్పుడు బిజెపికి దూరంగా ఉంటోన్న 'టిడిపి,శివసేన'లు కలవబోతున్నాయా..? ఈ కుంభకోణాలపై టిడిపి వైఖరి ఏమిటనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

   ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న టిడిపి నేడో..రేపో..ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడం ఖాయమని సర్వత్రా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పరిస్థితులు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..అడ్డగోలు సమాధానాలు చెబుతూ...దబాయిస్తున్న బిజెపి నేతలపై అంది వచ్చిన అవకాశాన్ని టిడిపి నేతలు సద్వినియోగం చేసుకుంటారా..? అనే ప్రశ్న సర్వత్రా ఆసక్తికరమైంది. ఇటీవల పార్లమెంట్‌లో ఆంధ్రాకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని..గుంటూరు పార్లమెంట్‌ సభ్యుడు 'గల్లా జయదేవ్‌' ప్రధానిని నిలదీసినట్లే....బ్యాంకింగ్‌ కుంభకోణాలపై ఆ పార్టీ నిలదీస్తుందా..? అనేదానిపై పార్టీలోనూ...ఇతర రాజకీయవర్గాల్లోనూ.. రాజకీయవిశ్లేషకుల్లోనూ చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు..తమకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే ఇప్పటి వరకూ..బిజెపిపై ఆగ్రహంతో ఉన్నారనే మాట నిజం...! దానిని సాకుగా తీసుకునే..ఆయన బిజెపి నుంచి బయటపడాలని చూస్తున్నారు...అయితే..తామేదో.. చేస్తామని..ఆగాలని బిజెపి పెద్దలు..పదే పదే ఆయనకు ఫోన్‌ చేస్తూ బుజ్జగిస్తున్నారు. అయితే...వారి మాటలను నమ్మని 'చంద్రబాబు' తన నిర్ణయం తాను తీసుకుని గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై జాతీయనేతలకు లేఖలు రాస్తానని చెప్పిన ఆయన..తరువాత కాలంలో బిజెపి చేసిన బ్యాంకింగ్‌ కుంభకోణాలపై గళం ఎత్తుతారా..? లేదా..? అదే విధంగా..బిజెపిపై ధ్వజమెత్తుతున్న కాంగ్రెస్‌కు పరోక్షంగానైనా మద్దతు ఇస్తారా..? కాంగ్రెస్‌తో ఆయన నేరుగా కలవలేరు..అదే సమయంలో బిజెపిని ఇరుకున పెట్టడానికి వచ్చిన సువర్ణావకాశాన్ని ఆయన వదులుకుంటారా..? అనే ప్రశ్నలు రాజకీయవర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

  నాలుగేళ్లపాటు నమ్మించి మోసం చేసిన 'బిజెపి'కి గుణపాఠం చెప్పేరోజు వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే..కేంద్రమంత్రివర్గంలోంచి తమ మంత్రులు వైదొలిగాక మాత్రమే..టిడిపి..బ్యాంకింగ్‌ కుంభకోణాలపై నోరెత్తనుందనేది సుస్పష్టం. కాగా..ఇన్నాళ్లూ..ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి జరిగిందని..తాము దాన్ని బయటకు తీస్తామని..ఒకటే ప్రచారం చేసిన రాష్ట్ర బిజెపి నేతలను నిలదీయడానికి టిడిపి నేతలకు కూడా మంచి ఆయుధం దొరికింది. అసలు ఇప్పటికే..బ్యాంకింగ్‌ కుంభకోణాలపై బిజెపిపై టిడిపి నేతలు దాడి చేయాల్సింది. కానీ...టిడిపి వ్యూహబృందం ఎందుకో..దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో ఇదే విషయంపై రగడ జరగనున్న నేపథ్యంలో దీన్ని టిడిపి ఆయుధంగా మలచుకుని..బిజెపి,వైకాపాలను దెబ్బకొట్టవచ్చు..మరి..టిడిపి వ్యూహ బృందం దీన్ని వాడుకుంటుందో..లేదో చూడాల్సి ఉంది.

(378)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ