WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సోమవారం నుంచి 'మోడీ'కి దబిడి..దిబిడే...!

ఈ సారి జరగబోతున్న పార్లమెంట్‌ రెండో విడత సమావేశాల్లో అధికార బిజెపికి ప్రతిపక్షాలు ముచ్చెమటలు పట్టించనున్నాయి. పుట్టపగిలినట్లుగా బయటపడుతున్న బ్యాంకింగ్‌ స్కామ్‌లు 'మోడీ'కి ముప్పుతేబోతున్నాయి. వేలకోట్ల పంజాబ్‌బ్యాంక్‌ కుంభకోణం, కొఠారీ అక్రమాలు, రఫెల్‌ కుంభకోణాలు 'మోడీ'కి ముచ్చెమటలు పట్టించబోతున్నాయి. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీమంత్రి చిదంబరం కుమారుడు 'కార్తీ చిదంబరం' అరెస్టుపై కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టనుంది. 'సోమవారం' సభ ప్రారంభం కాగానే..బ్యాంకింగ్‌ కుంభకోణాలపై ప్రతిపక్షాలన్నీ కలసి 'మోడీ' ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో అతి పెద్ద రెండవ బ్యాంక్‌ అయిన 'పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌' కుంభకోణంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు విరుచుకుపడబోతున్నాయి. నీరవ్‌మోడీతో 'మోడీ'కి నేరుగా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పార్లమెంట్‌ వేదికగా..'మోడీ'ని ఇరుకునపెట్టాలని వ్యూహం పన్నుతున్నాయి. ప్రతిపక్షాలన్నింటినీ ఐక్యంగా నడిపించేందుకు కాంగ్రెస్‌ చొరవ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నోట్లరద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్టను పోగొట్టిన 'మోడీ' తాజా బ్యాంకింగ్‌ కుంభకోణాలతో..ప్రజల దృష్టిలో విలన్‌గా మిగిలిపోయారు. 'మోడీ' ప్రభుత్వంపై సామాన్యులంతా.. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో...పార్లమెంట్‌ వేదికగా..కాంగ్రెస్‌ చెలరేగిపోవాలని భావిస్తోంది. నాలుగేళ్ల 'మోడీ' పాలనలో మధ్యతరగతి, సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారని..వారిని వేధించుకుతిన్నారని..అదే సమయంలో కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టారనే భావన సర్వత్రా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో...ఇప్పుడు...పార్లమెంట్‌ సాక్షిగా 'మోడీ'ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి వచ్చేందుకు కమ్యూనిస్టులు, తృణమూల్‌కాంగ్రెస్‌, డిఎంకె, సమాజ్‌వాద్‌పార్టీ, బిఎస్సీ వంటి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి,ఆకాళీదళ్‌, శివసేన పార్టీలు కూడా 'మోడీ'పై గుర్రుగా ఉన్నాయి. 

   ఈ నేపధ్యంలో 'సోమవారం' లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే..ఈ పార్టీలన్నీ ఆందోళనకు దిగనున్నాయి. మరోవైపు తమ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని..ఎన్‌డిఎలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమించబోతోంది. ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రధాని మోడీని నిలదీశారు. మరోవైపు..నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 5వ తేదీన జరగబోయే..మలివిడత సమావేశాల్లో..బ్యాంకింగ్‌ కుంభకోణాలు...ఆంధ్రాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపైనే ఆందోళన జరగనుంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ బ్యాంకింగ్‌ కుంభకోణాలతో పాటు..తమ పార్టీ నాయకులపై సిబీఐని ఉసిగొలిపారనే అంశంపై తీవ్రస్థాయిలో ఉద్యమించబోతోంది. ఈ విషయాలపై ఇతర పార్టీలను కలుపుకునిపోయి..'మోడీ'కి చుక్కలు చూపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ సమావేశాలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా..ఆయా పార్టీలు వ్యూహ,ప్రతివ్యూహాలను రచించుకుంటున్నాయి. మొత్తం మీద..కాంగ్రెస్‌, ఇతర పార్టీలు బ్యాంకింగ్‌ కుంభకోణాలపై నిలదీస్తే..ఆంధ్రా సమస్య మరుగునపడిపోతుందన్న భావన రాజకీయపార్టీల్లోనూ, ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది.  


(400)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ