WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టివి9కు గుణపాఠం చెప్పిన 'చంద్రబాబు'...!

చంద్రబాబును ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలి..వై.ఎస్‌.జగన్‌ను ఎంత త్వరగా ముఖ్యమంత్రిని చేయాలనే తపన వైకాపా సానుభూతిపరుల్లో ఉందో..లేదో కానీ...కొన్ని మీడియా వర్గాలు పరస్పరం పోటీ పడుతూ పోటీ పడుతున్నాయి. 'సాక్షి' పత్రిక కానీ...'సాక్షి' ఛానెల్‌ 'జగన్‌'కు చెందినవి కావడంతో.. ఆయన గురించి స్వామి భక్తిని చూపించడంలో తప్పులేదు. ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ ఎలాంటి లాలూచీలు..ఒప్పందాలు జరిగాయో కానీ...టివి9 మీడియా చంద్రబాబును ఎప్పుడు పదవి నుంచి దింపాలా అని టిడిపి ప్రభుత్వంపై విషం చిమ్మతుందోని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 'బాబు' ముఖ్యమంత్రిగా ఉంటే టివి9కి నష్టమేమిటి..? జగన్‌ సిఎం అయితే టివి9కు వచ్చే లాభమేమిటి..? అధికార అనుభవం కన్నా..అవినీతి చేసే వారే టివి9కు నచ్చుతుందేమోనని మంత్రులు దుయ్యబడుతున్నారు. ఒకవైపు అవినీతిని అంతం చేద్దాం..అవినీతిపై పోరడదాం..లంచాలు అడిగిన వారిని చెప్పులతో కొట్టండి..అని తమ ఛానెల్‌లో తాడికాయంత అక్షరాలతో ప్రచారం చేస్తోన్న టివి9 సంస్థ 'చంద్రబాబు' ప్రభుత్వాన్ని ఏదోవిధంగా అపఖ్యాతి పాలు చేసేందుకు వేదికపై చర్చల పేరుతో ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేయటం..ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టివి9 రిపోర్టర్‌ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు ఘాటుగా..ధీటుగా సమాధానం చెప్పారు. పనీ పాటలేని జిల్లాలోని కొందరు స్థానిక నాయకులు లేని సమస్యలను తెరపైకి తెస్తుంటే..దాన్ని మీరు ప్రచారం చేయటం..ఇంటర్వ్యూలో మీరు దాన్ని గురించి ప్రశ్నించడం..వారికంటే..మీకే ఎక్కువ ఇదిగా ఉందని కఠినంగా మందలించారు. 

  నీతులు చెప్పే టివి9 బృందం చంద్రబాబుకు గోతులు తవ్వుతున్నారని టిడిపి నాయకులు బాహాటంగా, ఆఫ్‌ ది రికార్డుగా అనేక సందర్బాల్లో దుయ్యబడుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై, వై.ఎస్‌.జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రచారం చేయని..టివి9 ఎక్కడైనా టిడిపి నాయకులు చేసే అవినీతిపై పదే పదే ప్రచారం చేయటంపై ఇతర మీడియా వర్గాలు తప్పుపడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి 'బాబు'ను వెంటనే దింపేసి 'జగన్‌'ను సిఎంను చేయాలని సాక్షి పత్రిక కంటే టివి9 ఎక్కువ ఉత్సాహం చూపిస్తుందని టిడిపి వర్గాలు దుయ్యబడుతున్నాయి. వైకాపాకు చెందిన ఓటర్లల్లో, సానుభూతిపరుల్లో రేటింగ్‌ పెంచేందుకు చంద్రబాబు వ్యతిరేక ప్రచారాన్ని చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు మీడియా వ్యవస్థను కొన్ని ఛానెల్స్‌, పత్రికలు విచ్చిన్నం చేస్తుంటే...మీడియాలో అపార అనుభవం ఉన్న..నిన్నటి వరకు పేరు ప్రతిష్టలు ఉన్న 'రవిప్రకాష్‌' కొత్తదారి ఎన్నుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టివి9 ప్రతినిధి ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏ విధంగా సమాధానం చెప్పారో..క్రింది వీడియోలో చూడండి...! https://www.youtube.com/embed/Cme5HiV5N_U


(444)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ