WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రెండు చిన్న రాష్ట్రాల్లో గెలిస్తేనే...అంత సంబరాలా...!?

వెనకటి...ఆరు నెలలు సాము చేసి..మూలనున్న ముసలమ్మను కొట్టిన వాడి సామెతలా..బిజెపి తాజా ఎన్నికల్లో సాధించిన విజయం. మూడు చిన్న రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒకచోట..పూర్తిస్థాయి విజయం...మరోచోట..మిత్రులతో కలసి విజయం సాధించిన బిజెపి సంబరాలకు అంతూపొంతేలేకుండా పోయింది. త్రిపురలో ఆ పార్టీ సాధించిన విజయం చెప్పుకోదగిందే. జీరో స్థాయి నుంచి అధికారపీఠానికి ఎగబాకడం..అభినందించాల్సిందే. అయితే..ఆ రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీపై గత ఇరవై ఏళ్ల నుంచి అధికారంలో ఉండడం, వారిపై అసంతృప్తి నెలకొనడమే..బిజెపి గెలవడానికి ప్రధాన కారణం. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, మార్పు కావాలని యువత కోరుకోవడంతోనే బిజెపికి విజయం సాధ్యపడింది. ఇక మరో రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఆ పార్టీ సాధించిన విజయం నామమాత్రమే. ఇక్కడ తన మిత్రులతో కలసి ఆ పార్టీ అధికారంలోకి రాబోతోంది. మూడవ రాష్ట్రమైన మేఘాలాండ్‌లో ఆ పార్టీ సాధించింది...కేవలం రెండు సీట్లు మాత్రమే. అంటే..ఇక్కడ బిజెపికి ఘోర పరాజయం ఎదురైందన్నమాట. 

  మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 177 సీట్లకు ఎన్నికలు జరిగితే..బిజెపికి స్వంతంగా దక్కింది కేవలం 48 సీట్లు  మాత్రమే. అంటే కనీసం మూడవ వంతు సీట్లు కూడా దక్కించుకోకపోయినా బిజెపి పెద్దలు తామేదో..ఘన కార్యం సాధించినట్లు...ఈశాన్య రాష్ట్ర్రాల ప్రజలు తమను నెత్తి ఎక్కించుకున్నారన్న చందంగా సంబరాలు జరుపుకోవడం నిజంగా విచిత్రంగా ఉంది. త్రిపురలో మొత్తం 60 సీట్లు ఉంటే..బిజెపికి దక్కింది 35 సీట్లు. అంటే..ఇక్కడ ఒక్కచోట మాత్రమే...బిజెపి నిజమైన విజయం సాధించినట్లు. మేఘాలయలో మొత్తం 60 సీట్లు ఉంటే..ఇక్కడ దక్కింది..కేవలం రెండు సీట్లు మాత్రమే...మరో రాష్ట్రమైన నాగాలాండ్‌లో కూడా 60సీట్లు ఉండగా అక్కడ బిజెపి గెలిచింది 11సీట్లు. మొత్తం మీద...అరకొర విజయాలకే సంబరపడి..దేశం మొత్తం'మోడీ' పాలనలో అద్భుతంగా ఉందని ప్రచారం చేసుకోవడం 'బిజెపి' పరివారానికే చెల్లింది.  



(288)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ