WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌' 'కిల్‌బిల్‌పాండే' అట....!?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మూడోఫ్రంట్‌...ఏర్పాటు చేసి...దేశానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించడంపై ఆయన ప్రత్యర్థులు హాస్యోక్తులు విసురుతున్నారు. 'రేసుగుర్రం' సినిమాలో 'బ్రహ్మానందం' పోషించిన 'కిల్‌బిల్‌పాండే' పాత్రలా కెసిఆర్‌ వ్యవహారం ఉందని కాంగ్రెస్‌, బిజెపి, ఇతర పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పట్టుమని నాలుగు పార్లమెంట్‌సీట్లు గెలవలేని...'కెసిఆర్‌'..దేశం మొత్తాన్ని దున్నేస్తానని చెప్పడం..దాన్ని మీడియో హైలెట్‌ చేయటం... ఏమిటని...వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండా కాకమ్మ కబుర్లు చెబుతోన్న కెసిఆర్‌.. ప్రజల అసంతృప్తిని దారి మళ్లించేందుకే.. ఇటువంటి కామెడీ వేషాలు వేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు.

   తాను ఫ్రంట్‌ పెడుతున్నానని ప్రకటించడంతోనే...పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి 'మమతాబెనర్జీ' తనకు ఫోన్‌చేశారని..ఆమె తన వెంట ఉంటానని ప్రకటించారని కెసిఆర్‌ చేసిన ప్రకటనను పశ్చిమబెంగాల్‌ సిఎం ఖండించారు. తాను ఆయనకు ఫోన్‌ చేయలేదని...ఆయనే తనకు ఫోన్‌ చేసి..మాట్లాడారని..దానికి తాను ఊ కొట్టానని ఆమె స్పష్టం చేసి కెసిఆర్‌ పరువును తీసేశారు. జాతీయ స్థాయిలో మూడో ప్రంట్‌ ఏర్పాటుపై ఆయన చేస్తోన్న హంగామాపై పలువురు జాతీయ నాయకులు పెద్దగా స్పందించడం లేదు. జాతీయ స్థాయిలో కెసిఆర్‌కు ఉన్న పలుకుబడి ఎంత..? ఆయన స్థాయి ఎంత...? ఆయనకు ఉన్న మద్దతు ఎంత..? ఆయన స్వంత బలం ఎంత...? అనేదానితో సంబంధం లేకుండా...ఎవరి అండో చూసుకుని కెసిఆర్‌ 'కిల్‌బిల్‌పాండే' టైపులో చెలరేగిపోతున్నారనే మాట వినిపిస్తోంది.

కెసిఆర్‌ను ఆడిస్తోందెవరు..!?

   తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మూడోఫ్రంట్‌ ప్రకటన చేయించిందెవరు..? ఆయన వెనుక ఉన్న ఆ శక్తి ఎవరు..? ఎవరి అండ చూసుకుని కెసిఆర్‌ 'కిల్‌బిల్‌పాండే'లా వ్యవహరిస్తు న్నారనే దానిపై రాజకీయ విశ్లేషకుల్లో లోతైన చర్చ జరుగుతోంది. ఓ దక్షిణాది ముఖ్యమంత్రి ఆయన వెనుక ఉన్నారని...ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన మాట్లాడలేరని...అందుకే కెసిఆర్‌ను వదిలారనే మాట వినిపిస్తోంది. ఇంకోవైపు...ఇప్పుడిప్పుడే దేశ వ్యాప్తంగా బలపడుతున్న కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి బిజెపినే ఆయనను రెచ్చగొట్టి వదిలిందనే మాటా వస్తోంది. తెలంగాణలో రోజు రోజుకు పుంజుకుంటున్న కాంగ్రెస్‌ను అడ్డుకోవడమే ధ్యేయంగా..ప్రజల దృష్టిని అడ్డుకోవడానికే 'కెసిఆర్‌' తన పొడుగు మించిన మాటలు మాట్లాడుతున్నారని ఆ పార్టీ విశ్లేషిస్తోంది.


(658)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ