లేటెస్ట్

అక్కడ ‘కవిత’..ఇక్కడ..‘అవినాష్‌’...!

నిన్నటి వరకూ తిరుగులేని అధికారం చెలాయించిన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ‘కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిలు సీబీఐ, ఈడీ అధికారులను చూసి ముచ్చెమటలు పోస్తున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల రక్త సంబంధీకులు తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటూ, అరెస్టు ముంగిట ఉన్నారు. తమ వారి అరెస్టులను ఎలాగైనా ఆపాలని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే..వారి యత్నాలు ఫలించే మార్గాలు మాత్రం కనిపించడం లేదు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి ‘కెసిఆర్‌’ తన రాజకీయ జీవితంలో తొలిసారి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా బలోపేతమైన, అడ్డగోలు అధికారాలను అనుభవిస్తున్న ఆయన, ఆయన కుటుంబసభ్యులు ఇప్పుడు తీవ్రమైన కేసులో కూరుకుపోయారు. స్వయంగా ‘కెసిఆర్‌’ కూతురు ఎమ్మెల్సీ ‘కవిత’ లిక్కర్‌ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆమెను నేడో రేపో ఈడీ అధికారులు అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఆమె ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే..తాను ఈ రోజు రాలేనని, చెప్పడంతో ఆమె విచారణ వాయిదా పడిరది. అయితే ఆమె ఎప్పుడు విచారణకు హాజరైనా..ఆమెను ఖచ్చితంగా అరెస్టు చేస్తారని, లిక్కర్‌ కుంభకోణంలో ఆమె పూర్తిగా ఇరుక్కుపోయారని, ఆమెను ‘కెసిఆర్‌’రక్షించలేరని కూడా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లిక్కర్‌ కుంభకోణంలో ఆమె పాత్రకు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని, ఇప్పటి వరకూ ఈ కుంభకోణంలో విచారణను ఎదుర్కొన్న పలువురు ఆమె పేరును బయటపెట్టడంతో..ఆమెకు ఈ కేసుతో ఉన్న సంబంధం బయటపడిరది. అయితే..ఈ కేసు నుంచి తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని బయటపడాలని ‘కెసిఆర్‌, ఆయన కూతురు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయం కోణంలోనే ఆమెపై కేసు పెట్టారని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తమను టార్గెట్‌ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. అయితే వారు చేస్తోన్న ఆరోపణలకు పెద్దగా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. 


ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తమ్ముడు, కడప ఎంపి ‘వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి’ తీవ్రమైన హత్యానేరాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ స్వంత బాబాయి, మాజీ ఎంపి, మంత్రి అయిన వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో ‘అవినాష్‌రెడ్డి’ హస్తం ఉందని సీబీఐ పేర్కొంటోంది. ఇప్పటికే ఆయనను రెండుసార్లు విచారించిన సీబీఐ రేపు మరోసారి విచారించబోతోంది. అయితే..రేపు విచారణ సమయంలో తనను అరెస్టు చేయవద్దని, ‘అవినాష్‌రెడ్డి’ తెలంగాణ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. గత ఎన్నికలకు ముందు జరిగిన ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి’ హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. హత్య జరిగిన రోజు..వైకాపా నాయకులు, వారికి సంబంధించిన మీడియా ముందుగా ‘వివేక’ది గుండెపోటు అని ప్రచారం చేసింది. అయితే తరువాత..ఈ హత్యను ‘చంద్రబాబు’ చేయించారని, ఈ హత్య వెనుక ‘చంద్రబాబు’ ఆయన పార్టీ నాయకులు ఉన్నారని, దీనిపై  సీబీఐ విచారణ చేయించాలని కోరింది. అయితే..తరువాత ‘జగన్‌’ సిఎం అయిన తరువాత సీబీఐ విచారణ అక్కర్లేదని తేల్చి, రాష్ట్ర పోలీసులతో విచారణ చేయించింది. అయితే..దీనిపై ‘వివేకా’ కుమార్తె సుప్రీంకోర్టులో కేసు వేసి, దీనిపై సీబీఐ విచారణను సాధించింది. సీబీఐ విచారణ తరువాత..‘జగన్‌’ తమ్ముడు, కడప ఎంపి, ఆయన తండ్రి ఉన్నారని కోర్టులో సీబీఐ పిటీషన్‌ వేసింది. ఆ తరువాత వారిని విచారణకు పిలుస్తోంది. అయితే..ఈ హత్య వెనుక తాము లేమని, తమను అక్రమంగా దీనిలో ఇరికిస్తున్నారని, వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘అవినాష్‌రెడ్డి’ మరోసారి సీబీఐ విచారణకు వెళుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ‘అవినాష్‌’ను రేపు అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే..‘అవినాష్‌’ అరెస్టును ఆపడానికి ముఖ్యమంత్రి జగన్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి, ‘అవినాష్‌’ను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే..ఈ కేసులో కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోరని, జగన్‌కు ఇతర విషయాలల్లో ఎంత మద్దతు ఇచ్చినా..ఈ విషయంలో వారు సహకరించరని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రక్త సంబంధీకులు అరెస్టు భయాన్ని ఎదుర్కోవడం రాజకీయంగా ఉత్కంఠత కల్గిస్తోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ