WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

9న బిజెపికి విడాకులు ఇవ్వనున్న టిడిపి...!?

ఇక అంతా అయిపోయింది. నాలుగేళ్ల స్నేహబంధం విడిపోనుంది. ఎన్నివిధాలుగా అభ్యర్థించినా..వేడుకున్నా..మొత్తుకున్నా పైసా నిధులు కూడా విడుదల చేయకుండా మొండికేస్తోన్న బిజెపితో తెగతెంపులు చేసుకోవాలని టిడిపి నిర్ణయించుకుంది. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగానైనా..బిజెపి పెద్దలు రాష్ట్ర విషయంలో నిర్ణయం తీసుకుంటారని భావించిన టిడిపి నేతలకు..అటువంటి సూచనలేమీ కనిపించకపోవడంతో..ఇక వారితో విడిపోవడానికే సిద్ధమైపోయారు. మంగళవారం నాడు సిఎం చంద్రబాబు నివాసంలో జరిగిన టిడిపి ఎమ్మెల్యేల సమావేశంలో బిజెపికి విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బిజెపితో పొత్తు కొనసాగించాలా..? లేక ఒత్తిడి చేస్తూ..మరి కొంత కాలం ఆగాలా...? లేక..ఇప్పటికిప్పుడే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలా..? అనే దానిపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని 'చంద్రబాబు' కోరగా..దాదాపు అందరూ వారితో తక్షణమే విడిపోవాలని కోరారని తెలుస్తోంది. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రం..మరి కొంత కాలం వేచి చూద్దామని చెప్పారని..అయితే..ఎమ్మెల్యేల అభిప్రాయం విన్న 'చంద్రబాబు' రెండు రోజుల్లో ఫైనల్‌ నిర్ణయం తీసుకుందామని వారికి చెప్పినట్లు సమాచారం. 

   మొత్తంమీద నాలుగేళ్లుగా సాగుతున్న బిజెపి, టిడిపి పొత్తుల బంధం శుక్రవారం నాడు తెగిపోతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు మీడియాతో ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ముందుగా శుక్రవారం నాడు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయిస్తారని..తరువాత..ఎంపీలతో పార్లమెంట్‌ సభ్యత్వాలకు రాజీనామా చేయిస్తారని..ఆ తరువాత..ఎన్‌డిఎ కూటమి నుంచి టిడిపి వైదొలుగుతుందని వారు చెప్పారు. నాలుగేళ్ల పాటు అపనమ్మకంతో సాగిన టిడిపి,బిజెపి బంధం చివరకు ఆ అపనమ్మకంతోనే కూలిపోబోతోంది. తన పదవికి 'చంద్రబాబు' నుంచి ముప్పు ఉందని భావించిన 'మోడీ'...ఆంధ్రాకు సహాయం చేయకుండా..'చంద్రబాబు'ను అణగదొక్కాలని భావించడమే..మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం. దీని వల్లే టిడిపి,బిజెపి బంధానికి బ్రేక్‌లు పడుతున్నాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా...కలహాల కాపురానికి శుక్రవారంతో విడాకులు ఖాయమని స్పష్టమైంది.


(457)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ