WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ' ఇచ్చిన 'మట్టీ-నీళ్ల'కు భద్రత కల్పించలేం..బాబోయి...!

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చమని..రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉద్యమబాట పడుతున్న సమయంలో...ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బిజెపి నేతలు తమ ప్రభుత్వం రాష్ట్రానికి చాలా చేసిందని..దానిపై ప్రజల్లోకి వెళతామని ప్రకటించడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. నూతన రాజధాని 'అమరావతి' శంఖుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ..రాష్ట్రానికి వరాలు ప్రకటిస్తారని..ప్రజలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తే..ఆయన 'మట్టీ-నీళ్లు' ఇచ్చి...తాను ఇచ్చేది ఇదేనని.. అప్పుడే ప్రకటించారు. అయినా ఆశ చావక...నాలుగేళ్లపాటు..ఎదురుచూసీ చూసీ ఇప్పుడు ప్రజలు ఉద్యమబాటలోకి వెళుతున్నారు. ఈ సందర్భంగా  ఓ ఆసక్తికరమైన విషయం జర్నలిస్టు మిత్రుడొకరు చెప్పారు. అదేమిటంటే...'మోడీ'..మూడేళ్లల్లో  రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు..కానీ...ఆయన తెచ్చిన 'మట్టీ-నీళ్ల'కు పోలీసులు కాపలా కాయలేకపోతున్నారట. 

   ప్రధాన మంత్రి హోదాలో ఆయన రాజధాని నిర్మాణానికి వేసిన శిలాఫలకం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో జనసంచారం లేదు..అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది. అక్కడ ఉదయం...సాయంత్రం షిప్ట్‌ల వారీగా పోలీసులు శిలాఫలకానికి భద్రత కల్పిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఆ శిలాపలకాన్ని ఎవరూ ధ్వంసం చేయకుండా రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల నుంచీ...పోలీసులు.. అక్కడే..కాపలా కాస్తున్నారు. వంతుల వారీగా ముగ్గురు నలుగురు పోలీసులు ఆ రాళ్ల చుట్టూ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. నిధులిస్తారని ఆశిస్తే..మట్టీ-నీళ్లు ఇచ్చి...వాటికి తమ పోలీసులతో కాపాలాకాయిస్తున్నారని...ఇదో  ఖర్చు అని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాని స్థాయిలో శిలాఫలకం వేయడంతో...దాని వద్ద బందోబస్తు లేకపోతే..దానిని ఎవరైనా ధ్వంసం చేస్తే..అదో పెద్ద న్యూసెన్స్‌ అవుతుందన్న ఉద్దేశ్యంతో..రాష్ట్ర ప్రభుత్వం ఆ శిలాఫలకం చుట్టూ...బందోబస్తు పెట్టి...కాపలాకాయిస్తోంది. మొత్తం మీద..నిధులు ఇవ్వకుండా.. తాను తెచ్చిన మట్టీ-నీళ్లకు కాపాలా పెట్టించి..రాష్ట్ర ప్రజల సొమ్మును ఆ విధంగా 'మోడీ'' ఖర్చు పెట్టిస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతైనా 'మోడీ' ఘనుడే..మరి...!


(297)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ