WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'పై బిజెపి ఎమ్మెల్యే ప్రశంసల వర్షం...!

ఒకవైపు ఈ క్షణంలోనే...మరో క్షణంలోనో టిడిపి, బిజెపి పార్టీలు విడిపోతాయని  మీడియా హోరెత్తిస్తుంటే...అసెంబ్లీలో మాత్రం బిజెపి పక్షనాయకుడు  'విష్ణుకుమార్‌రాజు' ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. అసెంబ్లీలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని...ఆయన వంటి నేత రాష్ట్రంలో లేరని ప్రశంసలు కురిపించారు. విభజనతో సమస్యలను ఎదుర్కొంటున్నా ఆయన పట్టువదలకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఇటువంటి నేతకు చేయూత ఇవ్వాలన్నారు. హుద్‌హుద్‌ తుఫాన్‌, విశాఖకు పెట్టుబడులు, దావోస్‌లో చంద్రబాబు పర్యటన, విదేశీపెట్టుబడుల కోసం సిఎం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన ఒకటే ప్రశంసలు కురిపించారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తలు చేస్తుంటే...టిడిపి సభ్యులు ఆయనకు సపోర్టుగా బల్లలు చరిచారు.  

   కాగా బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశంసలపై ఆ పార్టీలో ఓ వర్గం ఆయనపై విమర్శలు చేస్తుండగా..మరొక వర్గం మాత్రం ఆయనను వెనుకేసుకొస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు టిడిపిపై విమర్శలు గుప్పించిన 'విష్ణుకుమార్‌రాజు' వ్యవహారంపై అటు ప్రతిపక్షంలోనూ..ఇటు అధికారపక్షంలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయనకు అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పొగిడి పనులు చేయించుకుంటారని...తరువాత మళ్లీ టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అధికార పార్టీ నాయకులు అంటుండగా...'విష్ణుకుమార్‌రాజు' ఒక్కరోజులోనే ప్లేట్‌ ఫిరాయించారని ప్రతిపక్షాలతో పాటు..స్వంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా 'విష్ణు' కురిపించిన ప్రశంసలు ముఖ్యమంత్రి చంద్రబాబును బాగానే ఆకట్టుకున్నట్లున్నాయి.


(661)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ