WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాసేపట్లో...కేంద్రమంత్రులు 'అశోక్‌, సుజనా'లు రాజీనామా...!

ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి టిడిపి తన మంత్రులను ఉపసంహరించుకోబోతోంది. కాసేపట్లో కేంద్రమంత్రివర్గంలో ఉన్న 'అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి'లు రాజీనామా చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలతో..ఈ రోజు ఏ క్షణంలోనైనా టిడిపి మంత్రులు రాజీనామా చేయడం ఖాయమనే అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఉదయం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుధీర్ఘ ప్రసంగం తరువాత...వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి స్పందించడం..తాము ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేదేమీ లేదని..ఇప్పటికే ఇచ్చేది ఇచ్చామని..చెప్పడంతో..బాల్‌ చంద్రబాబుకోర్టులో పడింది. దీంతో..ఆయనపై ఎంపీల నుంచి ఒత్తిడి మొదలైంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని...బిజెపి మోసం చేసిందని...ఇక ఆ పార్టీ ప్రభుత్వంలో కలసి ఉంటే ప్రజలు టిడిపిని కూడా అనుమానిస్తారని...వెంటనే మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని వారు కోరారు. పలువురు ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి..మంత్రుల రాజీనామాపై వారితో చర్చించారు. మెజార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని కోరడంతో...ఢిల్లీలో ఉన్న మంత్రులు 'అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి'లను రాజీనామా చేయమని ఆదేశించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మరి కొద్ది నిమిషాల్లో తమ రాజీనామాలను సమర్పించబోతున్నట్లు సమాచారం.

(434)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ