WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కేంద్రంతో టిడిపి బ్రేక్‌అప్‌...!

ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా...!

అవమానించినా..రాష్ట్రం కోసం భరించా...!

ఇబ్బందులు పెట్టినా..లొంగిపోను...!

ప్రజలకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోను..!

మీడియా సమావేశంలో సిఎం చంద్రబాబు

అనుకున్నదే అయింది. గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు నిజం అయ్యాయి. కేంద్రంలోని ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం టిడిపి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రానికి సహాయం చేసే ఉద్దేశ్యం వారికి లేదని...కేంద్రం చేసిన చట్టాలను అమలు చేసే ఉద్దేశ్యం వారికి లేదని...ఇక ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఉండడం సాధ్యమయ్యే పనికాదని..అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి తమ మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను అందరితో మాట్లాడానని.. ముందు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుతో మాట్లాడానని..ఆయన రాజీనామా చేయడానికి..సిద్ధంగా ఉన్నానని తెలిపారని..సుజనాచౌదరి కూడా రాజీనామా చేస్తారని తెలిపారు. గురువారం నాడు మంత్రులు లోక్‌సభలో రాజీనామా చేస్తారని ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. కేంద్రమంత్రులతో రాజీనామా చేయించే ముందు టిడిపి అధినేత చంద్రబాబు..ప్రధాని మోడీతో ఆఖరిసారిగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే...'మోడీ' ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో...రాజీనామా నిర్ణయాన్ని ప్రధాని ఓఎస్‌డికి చెప్పామని సిఎం చెప్పారు. కష్టాలు వస్తాయని తనకు తెలుసునని, తనకు ఇబ్బందులు కూడా వారు సృష్టిస్తారని...అయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కు తగ్గేదిలేదని తెలిపారు. పలుసార్లు ఢిల్లీకి వెళ్లి..సహాయం చేయాలని కోరినా..వారు స్పందించలేదని...ఇక చేసేది లేక..తాము ఈ మార్గం ఎంచుకున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ పదవుల కోసం పాకులాడలేదని...రాష్ట్ర అభివృద్ధి కోసం తమ మంత్రులు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారని...కానీ.. తమ ఉద్దేశ్యం నెరవేరడం లేదని.. అటువంటప్పుడు..ఇక కేంద్రమంత్రివర్గంలో ఉండడం సరికాదని రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

   నాలుగు సంవత్సరాలుగా బిజెపితో ఎంతో ఓపిగ్గా ఎదురు చూశామని..తాను ఇప్పుడున్న నాయకులందరి కన్నా..సీనియర్‌ని అని..తనను అవమానాలు పాలు చేసినా రాష్ట్రం కోసం సహించానని...అయినా..రాష్ట్రానికి అన్యాయం చేశారని...'చంద్రబాబు' వాపోయారు. ఇక ఇంతకన్నా చేసేదేముందని...అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కష్టాలు ఉంటాయనే నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టానని...ఇక ఒపిక పట్టలేక..నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలు..మనోభావాలను వారు పట్టించుకోవడం లేదని...వారికి ఎన్నోసార్లు నచ్చచెబుదామని ప్రయత్నించారని..అయినా..వారు వినిపించుకోలేదని..అన్నారు. విభజన సమయంలో ప్రజలు చాలా బాధపడ్డారని..కొన్ని రాజకీయపార్టీలు చాలా నాటకాలు ఆడాయని.. అయినా ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని చెప్పారు. తాను అసెంబ్లీలో మాట్లాడిన..వెంటనే కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రెస్‌మీట్‌ పెట్టి తాము ఇచ్చేదేమీ లేదని చెప్పడం తనను బాధించిందని...అందుకే వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న రూ.350కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి... ఆర్‌బిఐ బ్యాంక్‌లో క్రెడిట్‌ చేసి మళ్లీ పిఎం క్లియరెన్స్‌ లేదని కట్‌ చేసుకున్నారు. దీన్ని బట్టి...వాళ్లు ఏ విధంగా రాష్ట్ర విషయంలో వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుందని అన్నారు.


(377)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ