WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' సహనానికి పరీక్ష పెట్టిన బిజెపి...!

గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా...కేంద్రం నాన్చుతూ ఉన్నా సిఎం చంద్రబాబు..తనదైనశైలిలో సర్దుకుపోతూనే ఉన్నారు. వాళ్లు ఇచ్చిందేమీ లేకపోయినా...ఇస్తారనే ఆశతో...వారికి ఎదురుచెప్పకుండా...విజ్ఞాపనలు పంపుతూనే ఢిల్లీ చుట్టూ ప్రదిక్షణలు చేశారు. నిన్నటి వరకు కూడా తాను ఆశించినంత ఇవ్వకపోయినా...ఎంతో కొంత ఇస్తారనే భావనతోనే వేచి చూస్తూ వచ్చారు. అయితే  అకస్మాత్తుగా..నిన్న విలేకరుల సమావేశం పెట్టి కేంద్ర మంత్రులను రాజీనామా చేయమని చెప్పడంపై టిడిపిలోని ఓ వర్గం నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఎందుకు హఠాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో తమకు అర్థం కావడంలేదని..వ్యాఖ్యానిస్తున్నారు. ముందుగా అంచనా వేసిన దాని ప్రకారం..మరి కొన్నాళ్లు...బిజెపితో కొనసాగాలని 'చంద్రబాబు' ఆలోచించారని... కానీ...కేంద్రంలోని బిజెపి పెద్దలు వ్యవహరించిన తీరుతో...ఆయన అప్పటికప్పుడే...ఆ నిర్ణయం తీసుకున్నారని వారు చెబుతున్నారు. తాను అసెంబ్లీలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి మూడు గంటల పాటు ప్రసంగించి, వారికి విజ్ఞప్తి చేస్తే...దాన్ని పట్టించుకోకుండా..తనపై బిజెపి పెద్దలు కౌంటర్‌గా..అరుణ్‌జైట్లీతో ప్రెస్‌మీట్‌ పెట్టించి..అవమానించారనే భావనతో చంద్రబాబు ఉన్నారు. అందుకే...ఇక వారితో తాడో..పేడో తేల్చుకోవాలనే మంత్రులతో రాజీనామా చేయించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

  వాస్తవానికి పార్లమెంట్‌లో ఎంపీలు తీవ్ర స్థాయిలో చేస్తోన్న నిరసనలు, రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని..ఇంటిలిజెన్స్‌ వర్గాలు కేంద్రానికి నివేదించడంతో...బిజెపి పెద్దలు మెత్తపడి..ఎంతో కొంత ఇస్తారు...ఇచ్చినది తీసుకుని..తరువాత...తన రాజకీయ ఎత్తులు వేయాలని 'చంద్రబాబు' ఆలోచించారు. అయితే...'బిజెపి' పెద్దలు..ఈ ఒత్తిడి వ్యూహంలో రెండాకులు ఎక్కువ చదివారు. తాము ఇచ్చేది ఇచ్చామని..ఇక 'చంద్రబాబు' ఇష్టమని..బంతిని 'బాబు' కోర్టులోకి నెట్టి...ఆయనను నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని కల్పించారు. ఇప్పటికిప్పుడే...బిజెపితో పొత్తును తెంచుకోకుండా...కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..వచ్చిన తరువాత..తుది నిర్ణయం తీసుకోవాలని భావించిన 'చంద్రబాబు'...బిజెపి పెద్దలు పన్నిన వలలో చిక్కారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో బిజెపి గెలిస్తే... 'బాబు'...కూటమి నుంచి వైదొలగడంపై కొద్దిగా ఆలోచించేవారు..గెలవకపోతే..వెంటనే కటీఫ్‌ చెప్పాలనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ..తాను అనుకున్న దానికంటే..ముందే...బిజెపితో 'బాబు' తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా...'చంద్రబాబు' సహనానికి పరీక్ష పెట్టి..బిజెపి పెద్దలు విజయవంతం అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా..ఇంత కన్నా..ఎక్కువ సహనంగా వ్యవహరిస్తే..తమ పార్టీ రాజకీయంగా దెబ్బతింటుందని..ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే సరైన నిర్ణయమని టిడిపి సీనియర్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటకలో బిజెపి గెలిచినా..గెలవకపోయినా...ఆంధ్రా ప్రజలు బిజెపి తమకు చేసిందేమీ లేదని...ఆ పార్టీతో ఉన్నందుకు..తమను కూడా దూషిస్తున్నారని..ఎంత త్వరగా విడిపోతే..అంత బరువు దించు కున్నట్లు అవుతుందని..సిఎం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం కూడా పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తం అవుతోంది.


(549)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ