WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మీసం' తిప్పి సవాల్‌ చేసిన 'జెసి'...!

అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి రాయలసీమ పౌరుషం చూపించారు. ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంట్‌లో ప్రాంగంణంలో వైకాపా ఎంపీలకు మీసం తిప్పి సవాల్‌ విసిరారు. రాజీనామాలు చేసేందుకు ముందుకు రావాలని..ఎవరి చిత్తశుద్ది ఎంతో తేల్చుకుందామంటూ ఆయన వారిపైకి దూసుకెళ్లారు. నిన్న టిడిపి మంత్రులు రాజీనామా చేస్తారని ప్రకటనలు రావడంతో..అవన్నీ డ్రామాలంటూ ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించడంపై..అక్కడే ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేస్తోన్న వైకాపా ఎంపీల వద్దకు 'జెసి దివాకర్‌రెడ్డి' వెళ్లి..ఏమయ్యా..మేము డ్రామాలు ఆడుతున్నామా...? మీరేం చేస్తున్నారు...? ఇక్కడ నిలబడి...ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు..? ఇదేనా మీరు చేసే ధర్నా..అంటూ..వారి ప్రశ్నించారు. దీంతో..వైకాపా ఎంపీలు టిడిపి నాయకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించగా...జెసి తీవ్రంగా స్పందించారు. తాము ఇప్పుడే రాజీనామాలు చేస్తామని...మీకు దమ్ముంటే...ఇప్పుడే..రాజీనామాలు చేయాలని మీసం తప్పి..తొడకొట్టి సవాల్‌ చేశారు. దీంతో తాము 21న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని ఏప్రిల్‌6న రాజీనామాలు చేస్తున్నామని వైకాపా ఎంపీలు చెప్పడంతో..'జెసి' మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మీరు డ్రామాలు ఆడుతున్నారంటూ..వారిపైకి దూసుకెళ్లారు. దీంతో..అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను ఆపి పార్లమెంట్‌లోపలికి పంపించారు. 'జెసి దివాకర్‌రెడ్డి' ఆగ్రహంగా వైకాపా ఎంపీలపైకి వెళ్లడంతో..వారూ..జెసి కొట్టుకుంటారనే భావన అక్కడ ఉన్న వారిలో వ్యక్తమైంది. పార్లమెంట్‌ సిబ్బంది కూడా ఈ గొడవ చూసి వారి విడదీసి పంపేశారు.


(2029)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ