WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ్యసభ రేసులో 'దేవేందర్‌గౌడ్‌'....!

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు మరో రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో హఠాత్తుగా...టిడిపి సీనియర్‌ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు 'టి.దేవేందర్‌గౌడ్‌' మరోసారి తనను రాజ్యసభకు పంపించాలని ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కోరారు. త్వరలో రాజ్యసభ సభ్యుడిగా రిటైర్‌కానున్న 'దేవేందర్‌గౌడ్‌' తన పేరును మళ్లీ పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖరాశారు. టిడిపిలో సీనియర్‌ నాయకుడు అయిన 'దేవేందర్‌గౌడ్‌' అనారోగ్యంతో.. ఇటీవల కాలంలో బయట ఎక్కడా కనిపించడం లేదు. అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన..ఇప్పుడు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం కావాలని లేఖ రాయడం టిడిపిలో చర్చనీయాంశమైంది. రాజ్యసభ సభ్యుడిగా..ఆయన పెద్దగా రాణించలేదని, అనారోగ్యమే దానికి కారణమని..పార్టీ, ప్రజలు భావించిన నేపథ్యంలో ఆయన మళ్లీ రాజ్యసభ సభ్యత్వం అడగడం ఏమిటని..? కొందరు టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

   ఒకప్పుడు 'చంద్రబాబు'కు అత్యంత సన్నిహితంగా మెలిగిన 'దేవేందర్‌గౌడ్‌' పార్టీలో నెంబర్‌ టూగా పేరుండేది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ..హైదరాబాద్‌లోనూ ఎదురులేకుండా చక్రం తిప్పిన ఆయన...టిడిపిలో సీనియర్‌ లీడర్‌. ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన..'దేవేందర్‌గౌడ్‌' ఎన్టీఆర్‌ మంత్రివర్గంలోనూ..తరువాత చంద్రబాబు మంత్రివర్గంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారు. బిసి వర్గానికి చెందిన 'దేవేందర్‌గౌడ్‌' అప్పట్లో అసెంబ్లీలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని దులిపేశారు. తన భూములమీదుగా..అవుటర్‌రింగ్‌రోడ్డును తీసుకెళు తుండడంతో..ఆయన వై.ఎస్‌తో ముఖాముఖిగా తలపడ్డారు. తాను 'దేవేందర్‌'ను కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించినా...ఆయన రానందుకే...'దేవందర్‌గౌడ్‌' వై.ఎస్‌ ఇబ్బందులు పాలు చేశారు. 

   పలుసార్లు 'మేడ్చల్‌' నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో టిడిపిని వీడి స్వంత పార్టీ స్థాపించి..రాజకీయంగా ప్రాభవం కోల్పోయారు. తరువాత 'చిరంజీవి' ప్రజారాజ్యం పార్టీలో చేరు చేదుఅనుభవాన్ని రుచిచూశారు. తరువాత..మళ్లీ స్వంత పార్టీలోకి రావడంతో...'చంద్రబాబు' ఆయనను రాజ్యసభకు పంపించారు. అయితే..తరువాత కాలంలో ఆయన అనారోగ్యానికి గురై...పెద్దగా బయటకు కనిపించలేదు. ఆయన కుమారుడు గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ మధ్య 'దేవేందర్‌గౌడ్‌' అమెరికాలో చికిత్స తీసుకుంటున్న సమయంలో 'చంద్రబాబు' ఆయనను అక్కడ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తరువాత ఆయన గురించి వార్తలు ఎక్కడా బయటకు రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా...ఆయన తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని లేఖ రాసి...తానూ పోటీలో ఉన్నానని చెప్పుకుంటున్నారు. సీనియర్‌నేతగా..ఆయనపై 'చంద్రబాబు'కు అభిమానం ఉన్నా..ప్రస్తుత పరిస్థితుల్లో...ఆయనకు రాజ్యసభ ఇచ్చే అవకాశాలు లేనేలేవు. మరి దేవందర్‌ ఎందుకు లేఖరాశాడో..?


(3575)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ