WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సంస్కారంలేని 'మోడీ'...!

ప్రధాని మోడీ...తన రాజకీయగురువు ఎల్‌.కె.అద్వానీ పట్ల వ్యవహరించిన తీరుపై..నెట్‌జన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా..విప్లవ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం సందర్భంలో జరిగిన సంఘటనపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపి కురువృద్ధుడు ఎల్‌.కె.అద్వానీ పాల్గొన్న ఆ సమావేశంలో స్టేజ్‌ మీద..ఆయనను 'మోడీ' అవమానించారు. స్టేజ్‌పైకి ప్రధాని హోదాలో వచ్చిన 'మోడీ'కి...అందరు నాయకులు నమస్కారం చేస్తూ ముందుకు కదులుతుంటే...'ఎల్‌.కె.అద్వానీ' కూడా.. 'మోడీ'కి నమస్కరించారు. అయితే...'అద్వానీ' చేసిన నమస్కారానికి 'మోడీ' ప్రతి నమస్కారం చేయకుండా..అసలు ఆయనను పట్టించుకోకుండా..మరో నేత మాణిక్‌సర్కార్‌తో నవ్వుతూ..కరచాలనం చేసి ముందుకు వెళ్లిపోయారు. నమస్కారానికి ..ప్రతినమస్కారం సంస్కారం..కానీ...'మోడీ'...మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. వ్యవహరించడం..'అద్వానీ' అభిమానులకు, ఇతరులకు కూడా బాధ కల్గిస్తోంది. రాజకీయాల్లో ఆటుపోట్లు సహజం కానీ...ఈ విధంగా అవమానాలు పాలుచేయటం సరికాదని..పలువురు రాజకీయనేతలు అంటున్నారు. ఈ సంఘటన ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది.
(2237)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ