WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'కు జాకీలేస్తున్న 'ఆంగ్లపత్రికలు'....!

ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బిజెపితో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకోవడంతో...బిజెపికి అనుకూలంగా ఉండే మీడియా మొత్తం ఇప్పుడు 'జగన్‌' వెంట నడుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి జాతీయ మీడియాలో 'జగన్‌'కు, బిజెపికి అనుకూలంగా వస్తోన్న వార్తలు దానినే రుజువు చేస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 'జగన్‌' పార్టీ గెలుస్తుందని సదరు జాతీయ మీడియా అడిగినా అడకపోయినా చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని...కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి మంత్రులు వైదొలిగితే..దాన్ని పట్టించుకోకుండా...'జగన్‌' విజయం సాధించబోతున్నారంటూ..సదరు పత్రికలు వార్తలు వండుతున్నాయి. అసలు సమయం, సందర్భం లేకుండా..రాస్తున్న ఈ వార్తలతో..'జగన్‌'కు జాకీలేస్తున్నారనే మాట..సర్వత్రా వినిపిస్తోంది.

   జాతీయ స్థాయిలో బిజెపి మౌత్‌పీస్‌గా మారిన 'రిపబ్లిక్‌టివీ', టైమ్స్‌ఆఫ్‌ఇండియా వంటి సంస్థలు ఇప్పుడు 'జగన్‌'కు వక్తాలా పుచ్చుకున్నాయి. దీనిలో పెయిడ్‌ ఆర్డికల్స్‌ ఉన్నాయా..? లేవా అనేది పక్కన బెడితే...బిజెపితో అంటకాగుతున్న 'వైకాపా'కు అవి ఉచితంగా ప్రచారం చేసి పెడుతున్నాయనే మాట వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...వైకాపా అధికారంలోకి రాకపోయినా...టిడిపి దగ్గరకు చేరుతుందని...టైమ్స్‌ఆఫ్‌ఇండియా కథనంలో పేర్కొంది. టిడిపికి...వైకాపాకు కేవలం రెండుశాతం మాత్రమే ఓట్లు తేడా ఉందని..రాబోయే రోజుల్లో లోటును అధిగమించి..అధికారం వైపు వైకాపా దూసుకుపోతుందని..ఆ సంస్థ రాసిన వార్తలో స్పష్టం చేశారు. 'జగన్‌' చేస్తోన్న పాదయాత్ర, రాష్ట్రానికి ప్రత్యేకహోదా..వంటి అంశాలు..ప్రజల్లోకి బాగా వెళ్లాయని...దీంతో...'జగన్‌' గెలుస్తారని...వార్తలు వండారు. 

  ఇక మరొక ఛానెల్‌ అయిన 'రిపబ్లిక్‌టివి' గత కొంత కాలం క్రితం ఒక సర్వే ప్రకటించింది. పార్లమెంట్‌ ఎన్నికలు జరిగితే..వైకాపాకు 13 ఎంపీ స్థానాలు వస్తాయని...తేల్చింది. అంటే...బొటాబొటి మెజార్టీ అన్నమాట. ప్రస్తుతం టిడిపి కంటే..వైకాపా వెనుకబడి ఉందంటూనే..మరోవైపు.. పుంజుకుంటుందని..రాబోయే రోజుల్లో దున్నేస్తుందని సదరు సంస్థలు 'జగన్‌'ను జాకీలేసి లేపాలని ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇప్పటికే...ఆంధ్రాను మోసం చేసిన 'బిజెపి'తో 'జగన్‌' కుమ్మక్కు అయ్యారని ప్రజలు భావిస్తున్న తరుణంలో...ఓటర్లు 'జగన్‌'కు ఓటువేస్తారా..? ప్రత్యేకహోదాను 'మోడీ' ఇస్తారని చెబుతున్న వైకాపా నేతలు..మరి ఇప్పుడే హోదా ఇప్పించవచ్చుకదా..? అనే ప్రశ్నలు కూడా వారి నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు హోదా ఇవ్వలేదని టిడిపి తన మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుంటే...ఇంకా 'మోడీ' హోదా ఇస్తారని చెబుతున్న వైకాపా నాయకులను ప్రజలు నమ్ముతారా..? ఏది ఏమైనా...ఒక పార్టీకి జాకీలేస్తున్న సదరు సంస్థలు..ప్రజాభిప్రాయాన్ని కొద్దిగానైనా ప్రతిఫలించే విధంగా వార్తలు ఇస్తే బాగుంటుంది.


(1245)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ