WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా'పై విషం కక్కుతున్న 'జాతీయ మీడియా'...!

ఆంధ్రప్రదేశ్‌పై మరోసారి జాతీయ మీడియా విషం కక్కుతోంది. ఆంధ్రులు గొంతెమ్మకోర్కెలను జాతి తీర్చలేదంటూ...ఉన్నవీ..లేనివీ..అసత్యాలతో విరుచుకుపడుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్‌ ఏమడుగుతోందన్న విషయాన్ని పట్టించుకోకుండా...ఆంధ్రాకు వ్యతిరేకంగా కథనాలను ప్రచురిస్తోంది. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో పట్టించుకోకుండా...బిజెపి నేతలు..ఇచ్చే ఇన్‌పుట్‌ను ఆధారంగా చేసుకుని ఆంధ్రాపై దుప్రృచారాన్ని చేస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో...ఆంధ్రుల మనోభావాలను పట్టించుకోకుండా...తెలంగాణకు ఏకపక్షంగా మద్దతు ఇచ్చి...ఆంధ్రులకు నష్టం చేసిన ఈ జాతీయ మీడియా ఇప్పుడు మరోసారి అదే ద్రోహం చేస్తోంది. అప్పట్లో...ఆంధ్రప్రదేశ్‌ను విభజించాల్సిందేనని...తెలంగాణకు నష్టం చేకూరిందని..ఊదరగొట్టి..విభజన పాపంలో జాతీయ మీడియా ప్రధాన పాత్రపోషించింది. హైదరాబాద్‌ లాంటి నగరం ఉన్న తెలంగాణ అన్యాయమై పోతుందని..విభజనే దీనికి పరిష్కారమని, తెలంగాణ వెనుకబడిందని...ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి..అప్పట్లో...విభజన చిచ్చుకు ఆజ్యంపోసింది. విభజన సమయంలో 'ఆంధ్రా'కు న్యాయం చేయాలని...నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ...ఢిల్లీలో టిడిపి అధినేత 'చంద్రబాబు' నిరవధిక నిరహారదీక్ష చేస్తే...ఆయనను ఎద్దేవా చేస్తూ...నాడు..చంద్రబాబుపై జాతీయ మీడియా విషం కక్కింది. తెలంగాణ ఏర్పాటుకు మీరు..అడ్డం పడుతున్నారంటూ..ఆయన చేసిన డిమాండ్‌ను అపహాస్యం చేస్తూ నాడు ప్రసారాలు చేసి ఆంధ్రులకు తీరని అన్యాయం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే దోవలో వెళుతూ మరోసారి..ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నాయి.

అసత్యాలతో ఎదురుదాడి...!

కేంద్ర మంత్రివర్గం నుంచి టిడిపి వైదొలిగిన తరువాత..ఎదురుదాడే లక్ష్యంగా..జాతీయ మీడియాను 'మోడీ' బృందం ప్రయోగించింది. సదరు జాతీయ మీడియాగా చెప్పుకునే ఈ సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడో తెలియదు..కేంద్ర మంత్రులు ఎందుకు రాజీనామా చేశారో తెలియదు..ఆంధ్రా ప్రజలు ఏమి అడుగుతున్నారో..తెలియదు..? పైగా...టిడిపి తెస్తోన్న ఒత్తిడికి కేంద్రం లొంగదట..! ఆంధ్రాప్రజలు చేస్తోన్న కోర్కెలు గొంతెమ్మ కోర్కెలట. అందుకే కేంద్రం స్పందించడం లేదని...ప్రచారం ప్రారంభించాయి. న్యూస్‌ ఎక్స్‌ అనే ఛానెల్‌ మరీ బరితెగించింది...! తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి మంత్రులు రాజీనామా చేశారట...? సిగ్గుందా...? వీళ్లకు..అసలు జరిగిందేమిటో.. తెలియకుండా...ఇటువంటి వార్తలు..ఎలా..ప్రసారం చేస్తున్నారో..? ఒకసారి అంటే పొరపాటున జరిగిందను కోవచ్చు..కానీ..పదే పదే..అదే విషయాలను ప్రసారం చేస్తూ శునకానందం పొందుతున్నాయి.

  ఇక మరోఛానెల్‌ అయిన టైమ్స్‌నౌది మరీ బరితెగింపు వ్యవహారం...! ప్రత్యేక హోదా కోసం 'చంద్రబాబు' ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌తో మాట్లాడారట. అంతే కాకుండా ఈ ఛానెల్‌...ఆంధ్రా వాళ్లు రక్షణ నిధులను కూడా అడిగారని ప్రచారం చేస్తోంది. రక్షణ కోసం కేటాయించిన నిధులు ఇవ్వకపోవడం వల్లే...టిడిపి తన మంత్రుల చేత రాజీనామా చేయించారని ప్రచారం చేస్తోంది. మరో ఛానెల్‌ అయిన  న్యూస్‌ ఎయిటీన్‌ 'రాజ్యసభ' ఎన్నికల కోసమే టిడిపి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిందని వార్తలు ప్రసారం చేసి..తన 'మోడీ' భక్తిని..చాటుకుంది. అసలు రాజ్యసభ ఎన్నికలకు..ఆంధ్రాకు సహాయం చేసే విషయానికి సంబంధం ఏమిటో..వార్తలు రాసిన వారికే అర్థం కాలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయమని...ఆంధ్రా 'జనం' కోరుతుంటే..అవి చెప్పకుండా... ఏవేవో..పనికి మాలిన విషయాలను ప్రస్తావిస్తూ...సంబంధం లేని వార్తలను వండివడ్డిస్తూ.. మరోసారి...ఆంధ్రాకు అన్యాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి...ఈ ఛానెల్స్‌. దక్షిణాదిలో ఈ ఛానెల్స్‌కు ప్రజల్లో సరైన గుర్తింపు లేదు కాబట్టి సరిపోయింది..అదే నిజమని ప్రజల్లో కొంత మందైనా నమ్మేవారేమో..కానీ..జాతీయ స్థాయిలో మాత్రం 'ఆంధ్రా'పై విషయం కక్కడంలో..ఈ ఛానెల్స్‌ విజయవంతం అయ్యాయి. వీరు చేస్తోన్న అరాచకాలను నాయకులు, ప్రజలు, చైతన్య వంతులైన వారందరూ..ఎక్కడికక్కడే ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  


(939)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ