WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపి రాజ్యసభ అభ్యర్థులుగా సిఎం రమేష్‌, కనకమేడల...!

టిడిపి తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం నాడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనకు అందుబాటులో ఉన్న నేతల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్లుగానే సిఎం రమేష్‌కు మరోసారి రాజ్యసభ సీటు దక్కింది. కాగా అనూహ్యంగా..ఎవరూ ఊహించని విధంగా సీనియర్‌ న్యాయవాది, పార్టీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు 'కనకమేడల రవీంద్రకుమార్‌'ను మరోస్థానానికి పార్టీ అధ్యక్షుడు ఎంపిక చేశారు. రాత్రివరకు రెండో అభ్యర్థిగా పార్టీ సీనియర్‌ నేత 'వర్ల రామయ్య' ఎంపిక అవుతారని పార్టీవర్గాలు, ప్రసారసాధనాలు ప్రచారం చేశాయి. అయితే 'కనకమేడల' రేసులోకి దూసుకు వచ్చారు. పలువురు సీనియర్‌ నాయకులు రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీ పడినా....కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా 'రవీంద్రకుమార్‌'కు పార్టీ అధ్యక్షుడు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.  


(1566)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ