WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎం రమేష్‌కు పొడిగింపు వెనుక 'రాధాకృష్ణ'...!?

రాజ్యసభ సభ్యునిగా రెండోసారి సిఎం రమేష్‌కు అవకాశం ఇవ్వడం వెనుక 'ఆంధ్రజ్యోతి' ఎండి 'రాధాకృష్ణ' సిఫార్సులు పనిచేశాయని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత 20రోజుల నుంచి సిఎం రమేష్‌కు రెండోసారి పొడిగింపు లేదని..ప్రచారం చేయడంతో..పార్టీ సీనియర్‌ నేతలు తమకు అవకాశం దక్కుతుందన్న భావనతో విశ్వప్రయత్నాలు చేశారు. అంతకు ముందుకు సిఎం రమేష్‌కు పొడిగింపు రావడం ఖాయమని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనంపై కొందరు మీడియా వర్గాలతో పాటు అధికారులు పెదవి విరిచారు. చివరకు అదే నిజమైంది. అప్పట్లో ఈ కథనాన్ని చదివిన టిడిపి నాయకులు...కార్యకర్తలు..'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రత్యేక ప్రతినిధికి ఫోన్‌చేసి.. ఇదంతా... నిజమేనని అడిగారు. సిఎం రమేష్‌ను తక్కువగా అంచనా వేయవద్దు...మొదట్లో వ్యతిరేక ప్రచారం ఉంటుంది. మెల్లమెల్లగా...ఆయనకు అనుకూలంగా ఉంటుంది. తెర వెనుక టిడిపి మంత్రులు, పత్రికాప్రతినిధులు.. ముందుకు వస్తారని ఆ ప్రతినిధి చెప్పారు. ఎవరెవరి ఒత్తిడి పనిచేసిందో కానీ..మళ్లీ సిఎం రమేష్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు ఈ విషయంపై టిడిపి నాయకుల్లో మంత్రుల్లో రసవత్తరమైన చర్చ జరుగుతోంది. రమేష్‌కు పొడిగింపు ఇవ్వరని పత్రికలకు లీక్‌ చేసిందెవరు..? ఆ వార్తను ప్రచురించిన మీడియా ప్రతినిధులు వారి పేర్లను ఎందుకు చెప్పడం లేదు. ఇందులో ఏదో పరమార్థం ఉంది..అని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. కానీ..సిఎం రమేష్‌కు పొడిగింపు రావడం వెనుక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒత్తిడి పనిచేస్తుందనే సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అధికారం ఉన్నా లేకున్నా...దివంగత వై.ఎస్‌ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పెట్టినా..అధికార వేధింపులు జరిగినా సిఎం రమేష్‌ తొణకలేదు..బెణకలేదు..చంద్రబాబును వదలిపెట్టిపోలేదు. ఈ విధేయతకు కూడా ఆయనకు కలసి వచ్చింది. కాంగ్రెస్‌ నాయకుడు కెవిపి రామచంద్రరావుతో సిఎం రమేష్‌కు సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలుసు. ఇదే విషయం ముందుగా తెలిస్తే..తామెవరమూ ప్రయత్నించేవారం కాదని రాజ్యసభ టిక్కెట్లు ఆశించిన ప్రముఖులు నిష్టూరమాడుతున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా దళిత వర్గానికి చెందిన 'రామయ్య' కానీ..జూపూడిని కానీ ఎంపిక చేస్తారని ప్రచారం జరగడం..అది ఆచరణలోకి రాలేదు. కానీ..వారిద్దరికీ మళ్లీ ఛైర్మన్‌ పదవులు ఇవ్వడం ఖాయమని కానీ...ఆయా ఛైర్మన్‌ పదవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని పత్రికలకు లీక్‌లు ఇవ్వడం జరిగింది.ఏదో పదవి దక్కుతుందిలే..అని వారిద్దరూ మౌనం వహించారు. ఏది ఏమైనప్పటికీ మీడియా వర్గాలకు లీక్‌లు ఇస్తుందెవరు...ఆ తరువాత అది అమలులోకిరాకపోవడానికి కారణం ఎవరో పార్టీ వర్గాల్లో ఎవరికీ అంతుబట్టడంలేదు.

(267)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ