WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రావెల' రాజకీయ జీవితం ముగిసిపోనుందా...!?

ఆయనో ఉన్నతాధికారి. హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. అదృష్టం కలసి వచ్చింది. టిడిపి తరుపున టిక్కెట్‌ దొరికింది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. తరువాత...చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన క్యాబినెట్‌ పదవి లభించింది. ఇంకేముంది...ఆయనకు హద్దేలేకుండా పోయింది. ఎమ్మెల్యే కావడమే జీవిత లక్ష్యమనుకున్న...ఆయనకు మంత్రి పదవి కూడా లభించడంతో...చెలరేగిపోయారు. పెద్దగా..అవినీతి ఆరోపణలు లేకుండానే పాలన సాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాసటగా ఉన్నారు. కానీ..స్వంత నియోజకవర్గంలోని ప్రజలను, పార్టీ కార్యకర్తలను, నాయకులను మాత్రం మెప్పించలేకపోయారు. స్వంత పార్టీ వారి కన్నా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుసుకోవడంలోనూ..వారికి పనులు చేసి పెట్టడంలోనూ ముందున్నారు. దీంతో స్వంత పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు..ఆయన చెవిన వేసినా...పెద్దగా పట్టించుకోలేదు. ముందు కొద్దిగా ఉన్న అసంతృప్తి తరువాత పెరిగిపోయి..చివరకు మంత్రి పదవికి ఎసరు తెచ్చింది. స్వంత పార్టీ కార్యకర్తలు, నాయకుల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ నాయకుడి పదవిని పీకేశారు. 

   దీంతో..ఆయన పార్టీలో పట్టుకోల్పోయారు. అయితే...పార్టీలో ఉంటూనే..ప్రత్యర్థి పార్టీతో సంబంధాలు పెట్టుకోవడానికి...ఎంఆర్‌పిఎస్‌ నాయకులకు ఆశ్రయం ఇస్తూ...పార్టీని ఇరకాటంలో పెట్టి...ప్రత్యర్థి పార్టీ అధినేతను ఆకర్షించాలని భావించారు. అయితే...ఈయన ప్రత్యర్థి పార్టీకి ఎంత మేలు చేసే కార్యక్రమాలు చేసినా..అక్కడ నుంచి..ఈయనకు సానుకూలత లభించడం లేదట. పార్టీలోకి రమ్మంటే...వస్తానని..సంకేతాలు పంపించినా..ఆ పార్టీ నాయకులు పట్టించుకోలేదట. దీంతో...ఇప్పుడు ఏమి చేయాలో..తెలియని స్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారట. మొత్తం మీద..వచ్చిన స్వర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా...జారవిడిచిన ఆ నేత రాజకీయ జీవితం ముగిసి పోయినట్లేనని..రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ..ఆ రాజకీయ ఎవరనుకుంటున్నారా...? ఆయనే పత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి 'రావెల కిశోర్‌బాబు'.


(2425)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ