WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రక్తహీనత నిర్మూలనకు'లడ్డూ'ఉద్యమం

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం

కృష్ణా జిల్లా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం' వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాను రక్తహీనత రహిత జిల్లాగా మార్చాలనే ధ్యేయంతో 'మేము సైతం' అన్న వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గర్బిణులు, బాలింతలు, చిన్నారులు, మహిళలకు పోషక విలువతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో...ఆయన 'లడ్డూ' ఉద్యమాన్ని ప్రారంభించారు. ఐరన్‌, ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే జొన్నలు, రాగులు, సజ్జలు, నువ్వులు, ఆకుకూరలు, బెల్లంతో 'లడ్డూ'లు తయారు చేయించి విద్యార్థులకు పంచబోతున్నారు. 

  సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నంలో కలెక్టర్‌ ప్రారంభించారు. స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 'మేముసైతం' కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని...అందు కోసమే పోషకాహారం ఎక్కువగా ఉండే జొన్నలు, రాగులు, సజ్జలతో చేయించిన 'లడ్డూ'లను పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 57వేల లడ్డూలను పంపిణీ చేయబోతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పిల్లలతో పాటు గర్బిణీలకు, బాలింతలకు ఈ లడ్డూలు అందజేస్తామని, ఈ కార్యక్రమం ఆరు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదే విధంగా..ఈ 'లడ్డూ'లు ఆహారంగా తీసుకున్న మహిళలు, గర్బిణీలు, బాలింతలు, చిన్నారుల్లో హిమోగ్లోబిన్‌ వృద్దిని ఏమేరకు పెరిగిందనే దాన్ని పరిశీలిస్తామని తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి వికాసం, కుటుంబ వికాసం, సమాజ వికాసం సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి సూచికల్లో ఆరోగ్యకరమైన సమాజం కీలకమని, ముఖ్యంగా మాతా,శిశు మరణాల నివారణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.


(172)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ