WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

2019లో టిడిపినే గెలుస్తుంది:మైసూరారెడ్డి

వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీనియర్‌ రాజకీయ నాయకుడు,మాజీ వైకాపా నేత మైసూరారెడ్డి చెప్పారు. ఆయన ఒక ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా..గొప్పగా పనిచేస్తుందని...రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ 'చంద్రబాబు'ను గెలిపిస్తారని తేల్చి చెప్పారు. ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు ఆయనను నమ్మరని, ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో వైకాపా కుమ్మక్కు అయిందనే విషయం ప్రజలకు బాగానే అర్థం అయిందని..వారి కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలు చెక్‌ పెడతారని ఆయన చెప్పారు. వైకాపా పెడుతున్న అవిశ్వాస తీర్మానం వల్ల ఉపయోగం లేదని...అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వమేమీ పడిపోదనే సంగతి సామాన్య ప్రజలకు కూడా తెలుసునని..అది ఒప్పందంలో భాగంగా వైకాపా పెడుతున్న తతంగమని..దానికి విశ్వసనీయత లేదని 'మైసూరారెడ్డి' ధ్వజమెత్తారు. 'చంద్రబాబు' సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని 'జగన్‌' చేతులు,కాళ్లు కట్టేశారని...ఆయన విశ్లేషించారు. కేంద్రమంత్రివర్గం నుంచి మంత్రులను తప్పించి 'చంద్రబాబు' 'జగన్‌'కు అందనంత ఎత్తుకు వెళ్లిపోయారని..ఇప్పుడు 'జగన్‌' ఏంచేసినా ఉపయోగం లేదని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపు తధ్యమని... వ్యాఖ్యానించారు.

   మాజీ కాంగ్రెస్‌ నేతగా..ఒకప్పుడు 'మైసూరారెడ్డి' వెలిగిపోయారు. హోంమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా...విషయం ఉన్న నేతగా ఆయనకు పేరుంది. సబ్జెక్ట్‌ ఉంటేనే మాట్లాడే నేతగా..అధికారపక్షాన్ని ఇరుకునపెట్ట గలిగిన సమర్థత కలిగిన ఆయన వై.ఎస్‌. మరణించిన తరువాత..'తండ్రి లేని పిల్లోనికి' అండగా ఉండాలని...ఆయన వైకాపాలో చేరారు. అంతకు ముందు 'రాజశేఖర్‌రెడ్డి'తో స్పర్ధలతో టిడిపిలో చేరిన ఆయనను టిడిపి గౌరవంగానే చూసింది.ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించింది.అయితే మళ్లీ తన రాజ్యసభ రెవిన్యువల్‌ చేయలేదని... భావిస్తూ..వైకాపాలో 'జగన్‌'కు అండగా ఉంటానని..ఆ పార్టీలో చేరిపోయారు. అయితే..చేరిన కొద్ది రోజులకే ఆయనకు 'జగన్‌'కు పొసగలేదు. అయితే ఎన్నికల వరకు భరించిన ఆయన తరువాత..ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఆయన ఇప్పుడు 'టిడిపి' రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తుందని వ్యాఖ్యానించి వైకాపాలో కలకలం సృష్టించారు.


(2702)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ