WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జనసేన' నుంచి 'జెపి' పోటీ...!?

సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో..వివిధ రాజకీయపార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపాలు అస్త్ర,శస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా...నూతన పార్టీ 'జనసేన' కూడా రంగంలోకి దిగుతోంది. ఈ రోజు గుంటూరులో పార్టీ నాల్గవ వ్యవస్థాపక దినోత్సవ సభను నిర్వహిస్తున్న ఆ పార్టీ...తరువాత ఎన్నికలపైనే దృష్టి సారించనుంది. ముందుగా వివిధ పార్టీల్లో బలమైన, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే కొందరు వైకాపా,టిడిపి నాయకులను ఆకర్షిస్తోన్న 'జనసేన'కు 'లోక్‌సత్తా' వ్యవస్థాపక అధ్యక్షుడు 'జయప్రకాష్‌నారాయణ'ను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోందట. ఇప్పటికే దానిపై చర్చలు జరిగాయని...'జనసేన'లో చేరడానికి 'జెపి' ఆసక్తితో ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అంతరంగికంగా చెబుతున్నాయి. 'జెపి' చేప్పే సిద్ధాంతాలు...'జనసేన' సిద్ధాంతాలకు సామీపత్య ఉందని..అందుకే ఆయనను పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పచెప్పాలని పార్టీ అధినేత 'పవన్‌కళ్యాణ్‌' భావిస్తున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. ఇటీవల రాష్ట్రానికి కేంద్రం ఏమాత్రం సహాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన నిధులను ఎలా ఖర్చు చేసిందనే దానిపై 'పవన్‌' వేసిన ఫ్యాక్టింగ్‌ కమిటీలో 'జెపి' కీలకంగా పనిచేశారు. ఆ సందర్భంగా 'పవన్‌,జెపి'ల మధ్య చర్చలు జరిగాయని, 'జెపి'ని పవన్‌ పార్టీలోకి ఆహ్వానించారని, దీనికి 'జెపి' అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.

విశాఖపట్నం నుంచి 'జెపి'...!

కాగా...'జనసేన'లో 'జయప్రకాష్‌ నారాయణ' చేరితే...ఆయనను స్టీల్‌ సిటీ అయిన విశాఖపట్నం పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యక్తిగతంగా 'జయప్రకాష్‌'ను ప్రజల్లో మంచి పేరు ఉండడం, నీతిమంతుడు కావడం, పాయింట్‌ టు పాయింట్‌ మాట్లాడే శక్తి, విశ్లేషణా సామర్ద్యం ఉన్న వ్యక్తి కావడంతో...ఆయన పార్లమెంట్‌లో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని 'పవన్‌' భావిస్తున్నారట. రాష్ట్ర సమస్యలను ఆయన జాతీయ స్థాయిలో వెలుగెత్తగలరని..అదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకదారి చూపించగలరని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయట. దీంతో...ఆయనను పార్లమెంట్‌కు పోటీ చేయించాలనే ఆలోచనతో 'జనసేన' వర్గాలు ఉన్నాయని సమాచారం. ఎన్నికల నాటికి..టిడిపితో 'జనసేన' పొత్తు కుదురుతుందని...తమ బలంతో పాటు..టిడిపి బలం కూడా తోడైతే...విశాఖలో 'జెపి' సునాయాసంగా విజయం సాధిస్తారని..ఆ వర్గాల భావన. పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు 'జెపి' సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద...'జెపి' 'జనసేన'లో చేరి పోటీకి దిగితే..అది ప్రత్యర్థులకు శరాఘాతమే...!

(513)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ