WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలో పదవుల పండుగ...!

తెలుగుదేశం పార్టీ నాయకులకు శుభవార్త. ఎన్నాళ్ల నుంచో..నామినేటెడ్‌ పదవులు, ఇతర పదవులు ఆశిస్తున్న నాయకుల కోరిక 'ఉగాది' తరువాత తీరబోతోంది. ఎన్నికలు జరిగిన నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్నా..ఇంకా కొన్ని నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయలేదని..ఇంకెప్పుడు భర్తీ చేస్తారని...ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులను 'ఉగాది' తరువాత 'చంద్రబాబు' సంతోషపెట్టబోతున్నారు. దానితో పాటు...మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు బిజెపి మంత్రుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయటంతో పాటు, మంత్రివర్గంలో స్థానం లేని వర్గాలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. మంత్రి పదవుల నుంచి కొంత మందిని తొలగించి...నూతనంగా మరి కొంత మందికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. 

  అదే సమయంలో నామినేటెడ్‌ పదవులను కూడా భర్తీ చేయబోతున్నారు. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న టిటిడీ బోర్డును త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఉగాది తరువాత...టీటీడీ ఛైర్మన్‌ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ పక్రియ ఉండబోతోంది. అదే సమయంలో వివిధ కార్పొరేషన్‌ ఛైర్మన్లను కూడా నియమించబోతున్నారు. ఇప్పటికే చాలా కార్పొరేషన్ల ఛైర్మన్‌ పదవీ కాలం ముగిసిపోయింది. వీరిలో కొందరు మళ్లీ తమకు ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు ఇవ్వాలని కోరుతుండగా..మరి కొందరు మాత్రం తమకు మరింత మెరుగైన శాఖలను ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇవి కాకుండా మిగిలిపోయిన మార్కెట్‌యార్డుల పాలకమండలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా..ఇంకా పదవులు భర్తీ చేయకపోవడంపై నాయకులు, కార్యకర్తలు లోలోన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆగ్రహాన్ని చల్లార్చేందుకైనా వెంటనే వీటిపై నిర్ణయం తీసుకోవాలని అధినేత భావిస్తున్నారు. మొత్తం మీద..'ఉగాది' తరువాత..నామినేటెడ్‌ పదవులతో పాటు ఎన్నికల క్యాబినెట్‌ను కూడా చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

(724)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ