WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ వ్యాఖ్యలు చేసినందుకే...'చింతమనేని'పై ధ్వజమెత్తిన'పవన్‌'...!

మహిళా ఎమ్మార్వో 'వనజాక్షి'పై దెందులూరు ఎమ్మెల్యే 'చింతమనేని ప్రభాకర్‌' దాడి చేసిన విషయాన్ని గుంటూరు సభలో 'పవన్‌కళ్యాణ్‌' ప్రస్తావించడం, ఆయనకు కొమ్ములున్నాయని ప్రశ్నించడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం మహిళా ఎమ్మార్వోపై దాడి చేశారనే...'చింతమనేని'పై 'పవన్‌' ధ్వజమెత్తలేదట...? తనను ఉద్దేశించి...అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే కారణంతోనే 'చింతమనేని'పై 'పవన్‌' విమర్శలు గుప్పించారని ఆ వర్గాలు అంటున్నాయి. అప్పుడెప్పుడో...'చింతమనేని' ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము 2014 ఎన్నికల్లో 'పవన్‌' వల్ల గెలవలేదని..టిడిపి బలంతోనే గెలిచామని చెప్పారు. 'పవన్‌' వల్ల తమకు లాభమేమీ జరగలేదని...'పవన్‌' పొడిచిందేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. దాంతో..అప్పటి నుంచి 'పవన్‌' ఆయనను టార్గెట్‌ చేశారని...ఎప్పుడు దొరుకుతాడా...? అన్నట్లు చూస్తున్నారని...ఈ రోజు బహిరంగ సభ సందర్భంగా...'పవన్‌' తన అక్కసు తీర్చుకున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. తనను దూషించిన వారిని..ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటానని చెప్పే 'పవన్‌' 'చింతమనేని'ని గుర్తు పెట్టుకుని ఆ వాఖ్యలు చేశారని వారు అంటున్నారు.


(921)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ