WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కెసిఆర్‌పై 'ఆంధ్రా' వాసుల ఆగ్రహం...!

తెలంగాణ ఉద్యమ సమయాన ఆంధ్రా ప్రజలను, ఆంధ్రాను తీవ్రంగా దూషించి, తెలంగాణ వాసులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ తరువాత కాలంలో ఆంధ్రావారిని మచ్చిక చేసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వారిని మెప్పించి గంపగుత్తగా వారి ఓట్లను కొల్లగొట్టారు. అప్పటి నుంచి వారితో సఖ్యత కొనసాగిస్తున్నారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రావారిని బుట్టలో వేసుకునేందుకు పలు రకాలుగా కెసిఆర్‌ ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఆంధ్రాకు చెందిన..కొన్ని సంపన్న వర్గాలను కెసిఆర్‌ ఆకట్టుకుని...ఆంద్రా వారికి తాను వ్యతిరేకం కాదని..తన ప్రభుత్వం ఆంధ్రావారిపట్ల సహృదయంతో వ్యవహరిస్తుందని చెప్పుకున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత...ఆంధ్రావారిపై ఎటువంటి దాడులు జరగలేదని...ఇదంతా తన ఘనతేనని చాటుకున్నారు.  దీంతో...హైదరాబాద్‌లో ఉండే సగటు 'ఆంధ్రా' వాసులు ఇప్పటి వరకు కెసిఆర్‌పై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్‌పై వ్యతిరేకతతో...టిడిపికి ఓట్లు వేసిన వారు..తరువాత టిడిపి బలహీనం కావడంతో...'టిఆర్‌ఎస్‌' వైపు చేరారు. ఇక అప్పటి నుంచి...ఆంధ్రా వాళ్లు తనవైపే ఉంటారనే భావనతో కెసిఆర్‌, ఆయన పార్టీ నాయకులు అంచనా వేశారు. అయితే...ఇప్పుడు పరిస్థితులు హఠాత్తుగా మారిపోయాయి.

  నిన్నటి వరకు ఆంధ్రా సమస్యల పట్ల సానుభూతిని ప్రదర్శించిన టిఆర్‌ఎస్‌ నాయకత్వం...హఠాత్తుగా తమకు ఆంధ్రా సమస్యల కన్నా స్వంత సమస్యలే ముఖ్యమని తేల్చి చెప్పడం...కేంద్ర ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం ప్రకటిస్తే...ముందు అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని చెప్పిన టిఆర్‌ఎస్‌ నాయకత్వం హఠాత్తుగా...ఇప్పుడు ప్లేట్‌మార్చి...తాము అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని, అది న్యాయమైన డిమాండ్‌ అని చెప్పిన టిఆర్‌ఎస్‌ ఎంపి, కెసిఆర్‌ కుమార్తె...తరువాత దానిపై మౌనం పాటించారు. ఆ పార్టీకి చెందిన నేతలు..తాము అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో..ఒక్కసారిగా టిఆర్‌ఎస్‌ నాయకులపై ఆంధ్రా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి దాకా..తాము మద్దతు ఇస్తామని చెప్పి...సరైనసమయంలో తాము మద్దతు ఇవ్వమని చెబుతున్నారని...ఇటువంటి వారి నాయకత్వంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని చెబితే..ఎలా నమ్మాలని వారు ప్రశ్నిస్తున్నారు. మాట మీద నిలబడలేని, నిలకడలేని కెసిఆర్‌ వంటి నాయకులను తాము నమ్మబోమని..వచ్చే ఎన్నికల్లో తాము ఆంధ్రా ప్రయోజనాలను ఎవరు కాపాడతారో..వారికే ఓటు వేస్తామని... హైదరాబాద్‌లోని ఆంధ్రాజనం చెబుతున్నారట. మొత్తం మీద..నిన్న మొన్నటి దాకా..ఆంధ్రా వాళ్లను నమ్మించిన కెసిఆర్‌..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంపై...ఆయనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

(524)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ