WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కేంద్రమంత్రి వర్గంలోకి 'కవిత'...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముద్దుల కుమార్తె 'కవిత' త్వరలో కేంద్రమంత్రి కాబోతోందట. కేంద్రమంత్రివర్గాన్ని జూన్‌లో ప్రధాని 'మోడీ' విస్తరించనున్నారని..ఈ విస్తరణలో 'కవిత'ను మంత్రిని చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తెలంగాణకు ఇప్పటి మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో..టిఆర్‌ఎస్‌ను ఎన్‌డిఎ కూటమిలోకి చేర్చుకుని...వారికి మంత్రి పదవులు ఇవ్వాలని 'మోడీ' భావిస్తున్నారట. ఇన్నాళ్లూ ఎడమొహం..పెడ మొహంగా ఉన్న ప్రధాన 'మోడీ' తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులు మారిన రాజకీయ పరిస్థితుల్లో..ఒకరికొకరు సహకరించుకోవాలనే భావనతో ఉన్నారు. తెలంగాణలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను ఓడించాలంటే...'బిజెపి' సహకారం అవసరం అని భావిస్తోన్న కెసిఆర్‌..ఈ మేరకు..వారితో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

  ఇటీవల కాలంలో కాంగ్రెస్‌,బిజెపిలకు వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేసిన కెసిఆర్‌...తనతో ప్రాంతీయపార్టీలన్నీ కలసి వస్తాయని అంచనా వేసుకున్నారు. కానీ...ఆయన ఫ్రంట్‌కు పెద్దగా మద్దతు లభించలేదు. ఒకరిద్దరు ప్రాంతీయ పార్టీ నేతలు కెసిఆర్‌తో మాట్లాడినా...తరువాత వారు కూడా మాయం అయిపోయారు. అయితే...మొన్న ఫ్రంట్‌ను బలోపేతం చేయడానికని.. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి వద్దకు కెసిఆర్‌ వెళ్లినా...ఆమె నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. దీంతో..ఫ్రంట్‌ ఆలోచనలు మానుకుని...ఎన్‌డిఎలో చేరితే ఎలా ఉంటుందనే దానిపై కెసిఆర్‌ తీవ్రంగా ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఎన్‌డిఎలో మూడవ అతి పెద్ద పార్టీగా ఉన్న టిడిపి ఆ కూటమి నుంచి బయటకు రావడంతో..ఆ స్థానంలో తాను చేరాలని కెసిఆర్‌ అండ్‌ కో నిర్ణయించుకున్నారట. అంతే కాకుండా టిడిపి దక్కించుకున్న రెండు మంత్రి పదవులు తమ పార్టీ తీసుకోవాలని... కేంద్రం,ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూశక్తుల అండతో...వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆయన ప్లాన్‌ వేస్తున్నారట. అంతే కాకుండా ఎన్‌డిఎలో చేరవడం వలన తన ముద్దుల కుమార్తె కోరికను కూడా ఇప్పుడే తీర్చినట్లు అవుతుందనే ఉద్దేశ్యంతో...కెసిఆర్‌ ఉన్నారట. మొత్తం మీద..జూన్‌ తరువాత...'కవిత' కేంద్రమంత్రి కావడం ఖాయమని టిఆర్‌ఎస్‌ వర్గాలతో పాటు తెలంగాణ బిజెపి వర్గాలు కూడా చెబుతున్నాయి. చూద్దాం..మరి ఏమవుతుందో..!?


(508)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ