లేటెస్ట్

'దేవులపల్లి అమర్‌' జీతం రూ.3.82లక్షలు...!

రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా మరియు ఇంటర్‌ స్టేట్‌ ఎఫైర్స్‌ సలహాదారు 'దేవులపల్లి అమర్‌'కు నెలకు రూ.3.82 లక్షలు జీతం ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు నెలకు రూ.2లక్షలు జీతం నేరుగా ఇవ్వనుండగా...వ్యక్తిగత సహాయకులకు రూ.70వేలు చెల్లించనుంది. దీనిలో ప్రైవేట్‌ సెక్రటరీ,పర్సనల్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ బాయ్‌, కారు డ్రైవర్‌ల జీతం ఉంది. మొబైల్‌ ఫోన్‌ కోసం రూ.2వేలు, ఇంటి అద్దె ప్రతి నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఇవి కాకుండా మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌, సెకండ్‌ క్లాస్‌ ట్రైన్‌ ఛార్జీలు/ఎకానమీ ఫ్లైట్‌, ఇంటర్‌నేషనల్‌ ప్లైట్‌ (బిజినెస్‌ క్లాస్‌) టిక్కెట్లను ఇస్తారు. 

(455)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ