WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పోసానీ' నీకు దండం పెడతాం...!

గత నాలుగు రోజుల నుంచి సినీనటుడు 'పోసాని కృష్ణమురళి' బూతులు వినలేక కొంత మంది చెవులు మూసుకుంటున్నారు. ఇవెక్కడ బూతులరా...బాబోయి..వినలేకపోతున్నాం...ఆ టీవీలను కట్టేయండరా..? బాబూ...! వీడెవడండీ...బాబూ...! ఆ టీవీ వాళ్లకైనా బుద్దిలేదా...? నడి ఇంట్లో ఈ బూతుల గోలమేటిరా...నాయనా...? వాటి నోటికి కొంచెం ప్లాస్టర్‌ వేయండరా...ఎవరైనా...? ఆ అరుపులు, కేకలు వినలేక..పోతున్నాం...ఇంట్లో పిల్లలు జడుసుకు ఛస్తున్నారు...? ఏమిటి...ఆయన బాధ...? చంద్రబాబును తిట్టమని...ఆయనకు  ప్రజలేమైనా.. పవరాఫ్‌ అటార్నీ రాసిచ్చారా..? ఒకటే ఆవేశపడిపోతున్నాడు...కాళ్లు పట్టుకుంటా..? అంటాడు...? కుక్కల కాట్లాటలా...ఒకటే ఒరుస్తాడు...? ఆయనకేమైంది...ఏమైనా పిచ్చా...? తేడా గాడు అని తెలుసు కానీ...ఈ రకమైన తేడాగాడు...అనుకోలేదు..ఏదో చిన్న మెదడు...చితికి...మెంటల్‌లా ప్రవర్తిస్తాడనుకున్నారు...కానీ.. చివరకు పిచ్చికుక్క కన్నా...హీనంగా...కాట్లాడుతున్నాడు...? 

  ఎంత 'జగన్‌', 'పవన్‌'ల మద్దతుదారు అయినా...ఇంతలా రెచ్చిపోవాలా..? వాళ్ల దృష్టిలో పడాలంటే..తిట్లే మార్గమా...? ఇంకే మార్గాలు లేవా...? తల్లినీ, ఆలినీ...తిడితేనే...సీటు ఇస్తామన్నారా...? వాళ్లిద్దరూ...? బాబూ...నీకు పుణ్యం... ఉంటుంది...రాష్ట్ర ప్రజలందరి తరుపునా...అడుగుతున్నాం...నీకు కావాల్సింది...అసెంబ్లీ సీటా...? లేక పార్లమెంట్‌ సీటా...ఏదో ఒకటి...మేమందరం..కలసి 'జగన్‌,పవన్‌'లు కలసి బతిమాలి..కాళ్లు పట్టుకుని అయినా...నీకు సీటు ఇప్పిస్తాం..నీ తిట్లు ఆపరా...బాబూ...? కడుపులో వికారంగా..దేవినట్లు... ఇంకేదో...అవుతోంది...? నీ శ్రమను వాళ్లు గుర్తించకున్నా..నీ బూతు పంచాంగాన్ని మేము గుర్తించాం...ఇంట్లో చిన్న పిల్లలు కూడా నీ జ్ఞానానికి మురిసిపోయి..నీ బూతులను వాళ్లు కూడా అందుకుంటున్నారు...? రోజూ టీవీలో నిన్ను చూసి..నీలాగే..వాళ్లు తేడాగా...మారుతున్నారు... దయచేసి..మా పిల్లలను ఆ స్థాయికి తీసుకెళ్లకూ..పోసానీ...నీకు దండం పెడతాం...!?

(బి.ఆర్‌.కె.మూర్తి)


(486)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ