WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వెంకయ్య' ఆ పుటేజ్‌ బయటపెడతారా...!?

ఒకవైపు...రాష్ట్రానికి...ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నామనే...వైకాపా నాయకులు.. మరొకవైపు...వాళ్లు పోరాటం చేస్తున్న నాయకుల కాళ్లనే పట్టుకుని ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరడం...ఈ విషయం..మీడియాలో ప్రసారం కావడంతో...టిడిపి నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగడం వైకాపా నాయకులకు పరిపాటి అయింది. రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే నేతలు....ప్రత్యేకహోదా సాధిస్తామనే వారు...రోజూ..పిఎంఒ చుట్టూ తిరుగుతూ...వాళ్లకు పాదాభివందనాలు చేస్తుంటే...వీళ్లు ప్రత్యేకహోదా తెస్తామంటే..ప్రజలు నమ్ముతారా...? సరే...ఆ సంగతి కాసేపు పక్కన పెడదాం...! అమాయకులైన ప్రజలు కొందరు నమ్మితే... నమ్మవచ్చు...నమ్మకపోవచ్చు...! కానీ..సాక్షాత్తూ...రాజ్యసభలోనే ప్రధాని కాళ్లకు వైకాపా నేత విజయసాయిరెడ్డి పాదాభివందనం చేసిన విషయం...రాజ్యసభ మొత్తం చూసింది. కానీ...తాను పాదాభివందనం చేయలేదని...కేవలం అభివాదం మాత్రమే చేశానని...'విజయసాయిరెడ్డి' వాదిస్తున్నారు. సరే...హోదాలో పెద్దవాడైన 'ప్రధాని'కి నమస్కారం చేయడాన్ని తప్పు పట్టలేం..కానీ...ఆయన బయటకు వచ్చి చేసిన విమర్శలు, ఆరోపణలు మాత్రం సరికావనే చెప్పాలి.

 గతంలో నిండు అసెంబ్లీలో 'చంద్రబాబు'ను ఉద్దేశించి...వై.ఎస్‌ అన్న మాటల తరహాలోనే... ఇంకాస్త...ఎక్కువ స్థాయిలోనే...'చంద్రబాబు'ను ఉద్దేశించి...'విజయసాయిరెడ్డి' ఆరోపణలు గుప్పించారు. ఒకపార్లమెంట్‌ సభ్యుడు...అయి ఉండి..వీధిలో మాట్లాడుకునే వారిలా...దిగజారి... ఆయన 'అమ్మ...అయ్య..ల భాష మాట్లాడడం..శోచనీయం. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు చేసుకున్నా...అమ్మనాబూతులు...వదిలేయాల్సింది. సరే...ఇప్పుడు ఆయనేమంటారు..? తాను 'మోడీ' పాదాలను తాకలేదు...కేవలం నమస్కరించాను..అంటారు. దీని గురించి రాజ్యసభ పుటేజ్‌ బయటపెట్టాలని ఆయనే లేఖ రాశారు. ఆ పుటేజ్‌ బయటపెట్టి...తాను 'మోడీ' పాదాలను తాకలేదని...నిరూపించుకోవచ్చు...కానీ...అసంబద్దమైన విమర్శలు చేసి...ఆయన పరువును ఆయనే తీసుకున్నారు. ఇక్కడే...ఆయన.. ప్రస్టేషన్‌ బయటపడిపోయింది. తాను చేసిన పని...ఇతరులు చూసారనే భావనతోనే...ఆయనకు క్రోథం ముంచుకొచ్చి...నోటికి పనిచెప్పినట్లుంది. అయితే...ఇప్పుడు...రాజ్యసభ పుటేజ్‌ బయటకు వస్తే...నిజాలు తెలిసే అవకాశం ఉంది. మరి..రాజ్యసభ ఛైర్మన్‌...పుటేజ్‌ బయటకు ఇవ్వడానికి ఒప్పుకుంటారా...? ఒకవేళ పుటేజ్‌ బయటకు వస్తే...'విజయసాయిరెడ్డి'కి తిప్పలు తప్పవేమో...? అయితే...ఇటీవల కాలంలో తన వెనుక ప్రధాని మోడీ...ఉన్నారన్న అహంకారంతో...ఆయన ఎవరినీ లక్ష్యపెట్టడం లేదట...? ఇప్పుడు పుటేజ్‌ బయటకు వచ్చినా..దానిపైనా..ఆరోపణలో...విమర్శలో చేస్తారే...తప్ప...దాని గురించి ఆయన పెద్దగా చింతించరేమో..? కానీ...'వెంకయ్య' పుటేజ్‌పై నిర్ణయం తీసుకుంటే...వైకాపా పోరాటం...ఆరాటం... ఆంధ్రా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి 'వెంకయ్య' ఏం చేస్తారో..చూడాలి మరి...!


(438)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ