WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఈ-కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం'....!

వినూత్న ఆలోచనలు, నిరంతర శ్రమ, సమర్థతతో దూసుకుపోతూ నెంబర్‌వన్‌ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇప్పుడు మరో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీనీ వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే...కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం' నడుస్తున్నారు. ముఖ్యమంత్రి 'చంద్రబాబు'  ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం, ప్రజలతో నేరుగా సంబంధాలు కల్గి ఉండడం కోసం రూపొందించిన 'ఖైలాజా' యాప్‌ తరహాలోనే...కలెక్టర్‌ లక్ష్మీకాంతం కూడా 'ఈ-కలెక్టర్‌' యాప్‌ను రూపొందిస్తున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వారికి నిత్యం అందుబాటులో ఉండే లక్ష్యాలతో...'ఈ-కలెక్టర్‌' యాప్‌ను రూపొందిస్తున్నారు. ఒక ప్రైవేట్‌ సంస్థకు ఈ యాప్‌ను తయారు చేసే పనిని అప్పగించారు. మొదట ప్రయోగాత్మకంగా...యాప్‌ను పరిశీలించి..తరువాత దీన్ని గూగల్‌ ప్లేస్టోర్‌కు అనుసంధానం చేస్తారు.

   జిల్లా ప్రజలను తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఈ-కలెక్టర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా ఫిర్యాదులు, సూచనలు, సలహాలు చేయవచ్చు. తమకు వచ్చిన సమస్య గురించి నేరుగా కలెక్టర్‌కు విన్నవించుకోవచ్చు. ఆడియో,వీడియో రూపంలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. పీడీఎఫ్‌, టెక్ట్స్‌ ఫార్మాట్లలో ఫిర్యాదు చేయవచ్చు. తెలుగులో కూడా ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చు. ఫిర్యాదుదారు..తాను ఏ లొకేషన్‌లో ఉన్నాడో...ఈ-యాప్‌ ద్వారా తెలిసిపోతుంది. వచ్చిన ఫిర్యాదు పరిశీలనకు గురి అయిందా...? కలెక్టర్‌ దీనిపై ఏం చర్య తీసుకున్నారు...మీరు ఇచ్చిన ఫిర్యాదు ఏ అధికారి వద్ద ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పనితీరుపై సరిగా లేకున్నా దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వివిధ పథకాల సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో...లేక ఇతర సహాయం కోసం యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. జిల్లా ప్రజలకు ఉపయోగపడే..ఈ-కలెక్టర్‌ యాప్‌ ప్రస్తుతం..పరిశీలన దశలో ఉంది. పరిశీలన అయిన తరువాత వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో నెంబర్‌వన్‌ స్థానంలో జిల్లాను నిలిపిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఇప్పుడు మరోసారి తన వైవిద్యాన్ని చాటుకుని మిగతా కలెక్టర్లకు స్ఫూర్తిగా నిలిచారు.


(535)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ