WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌'కు టచ్‌లో ఉన్న 40మంది ఎమ్మెల్యేలు ఎవరు...?

40మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు తనను స్వయంగా కలసి తమ ప్రభుత్వ అవినీతిపై ఆవేదన వ్యక్తం చేశారని...ఆ అవినీతిని భరించలేకపోతున్నామని మీరైనా నిలదీయండి...అని 'జనసేన' నేత 'పవన్‌కళ్యాణ్‌' బాహాటంగా..పదే పదే చెప్పిన విషయం..అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగా 40మంది ఎమ్మెల్యేలు ఆయనను కలిశారా..? కలిస్తే...ఎప్పుడు..ఎక్కడ కలిశారు..? ప్రభుత్వ అవినీతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారా..? వాస్తవానికి..టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అతి కొద్దిమంది మాత్రమే నిజాయితీపరులుగా పేరు తెచ్చుకున్నారు. అవినీతిపై ఫిర్యాదుపై ఎంతమంది నిజాయితీపరులు ఉన్నారు...? ఇదంతా అబద్దం...కావాలనే 'పవన్‌కళ్యాణ్‌' ప్రచారాన్ని ప్రారంభించారు..తాము కొందరిని కలిసిన మాత్రమే నిజమే..వ్యక్తిగత పరిచయాలతో కలుస్తాం...తనకు కూడా...పవన్‌ సన్నిహితుడే..ఆయన ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు..ఇప్పుడేమో...బండరాళ్లు వేస్తున్నారని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 40మంది కలిశారంటే...తాను కూడా నమ్మడం లేదని...మంత్రుల్లో గతంలో ఆయనకు సన్నిహితులైన గంటా శ్రీనివాసరావుతో పాటు ఒకరిద్దరు మంత్రులు ఉండవచ్చు...ఎమ్మెల్యేల్లో ఆయనకు కొంత మంది తెలియవచ్చు..మిగతా వారెవరూ..కలిశారంటే తాను నమ్మడం లేదని సదరు ఎమ్మెల్యే గట్టిగా చెబుతున్నారు. నిజంగా 40మంది ఎమ్మెల్యేలు...'పవన్‌'ను కలిశారా..? అని ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఆరా తీయగా...ఆ సంఖ్య అవాస్తమని తెలుసుకున్నాయట. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 'పవన్‌' విమర్శలు, ఆరోపణలపై అంతగా స్పందించడం లేదు..ఎమ్మెల్యేలు, మంత్రులను ఆయన అనుమానించడంలేదు..'పవన్‌' ఎందుకు ఆ విధమైన ప్రకటన చేశారా..? అనే విషయంపై ఒక మంత్రి మీడియా వర్గాలను ఆరా తీశారు. 

   గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు..విజయం సాధించిన వారు ఉండవచ్చు...లేదా..మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయనకు పరిచియం ఉండవచ్చు. కానీ..ఇంత దారుణమైన ఆరోపణలు బాహాటంగా చేయటం పవన్‌స్థాయికి తగదని...ఆయన సామాజికవర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమను కలిసిన వారితో చెబుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో రాజకీయవర్గాల్లో..'పవన్‌' చేసిన ప్రకటన ఎంతో సంచలనం సృష్టిస్తుందని రాజకీయ పరిశీలకులు భావించినా..ఆ విషయాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని స్పష్టమైంది. ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు,మంత్రులు తనకు టచ్‌లో ఉంటున్నారని 'పవన్‌' చేసిన ప్రకటనను 'జనసేన' నాయకులే నమ్మడం లేదు. ఈ విషయంపై 'చంద్రబాబు' రహస్యంగా సమాచారం సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరో 15రోజుల్లో 'పవన్‌' చేసిన ప్రకటనపై వాస్తవాలు తెలుస్తాయని...తరువాత ఎవరితో ఎదురుదాడి చేయించాలనేదానిపై 'బాబు' నిర్ణయం తీసుకుంటారని వారు చెబుతున్నారు. చిత్రివిచిత్రమైన విషయం ఏమిటంటే...బిజెపి ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు 'జనసేన' అధ్యక్షుడు చేసిన విమర్శలను, ఆరోపణలను నమ్మడం లేదు. ఇదే విషయాన్ని బిజెపి ప్లోర్‌లీడర్‌ విష్ణుకుమార్‌రాజు కూడా అనే సందర్బాల్లో బాహాటంగానూ, ఆప్‌ ది రికార్డుగా చెప్పడం జరిగింది.

(279)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ